స్టార్ హీరో కమలహాసన్ నట వారసురాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శృతిహాసన్. ఈ ముద్దుగుమ్మ మల్టీ టాలెంటెడ్ గల హీరోయిన్ గా పేరు పొందింది. కేవలం ఒక్క భాషకే పరిమితం కాకుండా అటు ఇతర భాషలలో సైతం కూడా నటిస్తూ పాన్ ఇండియా రేంజ్ లో పేరు సంపాదించుకున్నది. ప్రస్తుతం పలు ఓటీటీ లో కూడా నటిస్తూ చాలా బిజీగా ఉన్నది.ఇక ఇంత ఇమేజ్ ఉన్నప్పటికీ తన తండ్రి ఇమేజ్ ను ఒకసారి కూడా ఎక్కడా ఉపయోగించుకోలేదు. కేవలం తన తండ్రికి మాత్రమే మద్దతు ఇస్తుంది. కానీ ఎప్పుడూ కూడా ఆమె తన తండ్రి పేరును ఉపయోగించుకోలేదు.


అలా శృతిహాసన్ కేవలం స్వతహాగా పైకి ఎదగాలనుకుంది శృతిహాసన్. తన వ్యక్తిగత విషయంలో కూడా తల్లిదండ్రుల నిర్ణయంతో ఎటువంటి సంబంధం లేకుండా సొంత నిర్ణయాలను తీసుకుంటూ ఉంటుంది శృతిహాసన్. హీరోయిన్ గా ప్రతి సినిమాకు కూడా ఆమె కథ విని నిర్ణయాన్ని తీసుకుంటుందట. ఇప్పుడు ఆమె లవ్ జీవితంలో కూడా సొంత నిర్ణయాన్ని అనుసరిస్తూ ఉంటుంది. ఎంతో హ్యాపీగా తన జీవితాన్ని కొనసాగిస్తున్న శృతిహాసన్ ఇటీవల స్వయంగా తన ఆరోగ్య సమస్యల గురించి తెలియజేసి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో ఆమె అభిమానుల సైతం ఒకసారిగా ఆశ్చర్యపోయారు.


శృతిహాసన్ కు హార్మోన్ లోపం కారణంగా తను చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేసింది.. ఇంస్టాగ్రామ్ లో శృతిహాసన్ చేస్తున్న ఒక వర్కౌట్ వీడియోను కూడా షేర్ చేసింది. వీటితోపాటు తన ఆరోగ్య సమస్యలను కూడా తెలియపరిచింది.. నాలాగా మీరు కూడా వర్కౌట్ చేయండి ప్రస్తుతం నేను కొన్ని హార్మోన్ సమస్యలను ఎదుర్కొంటున్నాను వాటి వల్ల జీవ క్రియ సరిగా ఉండకపోవడంతో పాటు కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మహిళలు ఇలాంటి వాటిని రెగ్యులర్ గా వర్కౌట్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు మినిమంగా వర్కౌట్ చేయడం ద్వారా మంచి ఆరోగ్యం ఉంటుంది అని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: