నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో ఓ చారిత్రాత్మక చిత్రం రూపొందుతుంది అన్నప్పుడు, ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు ఓ రేంజ్లో ట్రోలింగ్ జరిగిందట..


ముఖ్యంగా 'బింబిసార' ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు 'ఎన్టీఆర్- మెహర్ రమేష్ ల డిజాస్టర్ మూవీ 'శక్తి' అన్ సీన్ పిక్ లా ఉంది' అంటూ విమర్శించిన వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే. అయితే టీజర్ రిలీజ్ అయ్యాక ఆ కామెంట్స్ అన్నిటికి ఫుల్ స్టాప్ పడినట్లు అయింది.


ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ను కనుక చూస్తే ముందుగా ట్రోల్ చేసిన వాళ్ళంతా ముక్కున వేలేసుకోవాల్సిందే మరి.ఓ పాన్ ఇండియా సినిమాకి ఉండాల్సిన అన్ని అర్హతలు ఈ 'బింబిసార' కి ఉన్నాయనే ఫీలింగ్ ను కలిగించింది ఈ ట్రైలర్. ఒకసారి చూస్తే ఇంకోసారి చూసే ఫీలింగ్ ను కూడా కలిగించింది కూడా. గతానికి, ప్రస్తుతానికి లింక్ చేస్తూ ఈ చిత్రం కథ ఉంది. ప్రపంచాన్ని తన కాలు కింద పెట్టుకోవాలనుకున్న విలన్, మధ్యలో నిధి, ప్రస్తుతానికి 'బింబిసార' ఎంట్రీ..


 


ప్రధాన అంశంగా ఈ చిత్రం రూపొందింది. 2 నిమిషాల 39 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ ప్రతీ ఒక్కరికీ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉందని తెలుస్తుంది.ట్రైలర్ లో హైలెట్స్ గురించి చెప్పుకోవాలి అంటే ప్రధానంగా విజువల్స్ గురించి చెప్పవచ్చు.రెండో హైలెట్ కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలి. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందింది ఈ చిత్రం. అయితే రూ.60 కోట్ల బడ్జెట్ లో అది కూడా ఓ డెబ్యూ దర్శకుడు తీసిన సినిమా..


 


వి.ఎఫ్.ఎక్స్ ఇంత క్వాలిటీగా ఉంటాయి అని ఎవ్వరూ కూడా ఊహించలేదు. ఈ మధ్యనే వచ్చిన 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ ను 'బింబిసార' ట్రైలర్ ను పక్కన పెట్టుకుని చూస్తే.. దీనికే వందకి వంద మార్కులు పడతాయి అనడంలో అతిశయోక్తి అయితే లేదు. దర్శకుడు మల్లిడి వశిష్ట్ కు 'ఇది నిజంగా మొదటి చిత్రమా'.. అనే డౌట్ ట్రైలర్ చూస్తున్నంత సేపు కలుగుతుందట.. లేట్ చేయకుండా ఒకసారి ఈ ట్రైలర్ ను ఓ లుక్కేయండి

మరింత సమాచారం తెలుసుకోండి: