అందాల ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది . టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆఖరుగా నాచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ లో గెస్ట్ పాత్ర లో నటించింది .

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ అనుపమ పరమేశ్వరన్ పాత్రకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి . ఇది ఇలా ఉంటే అనుపమా పరమేశ్వరన్ తాజాగా బటర్ ఫ్లై అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని థియేటర్ లలో కాకుండా నేరుగా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మూవీ ని ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' లో త్వరలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని 'ఓ టి టి' సంస్థ ప్రకటించలేదు .

మూవీ కి ఘంటా సతీష్ బాబు దర్శకత్వం వహించగా, భూమిక చావ్లామూవీ లో కీలక పాత్రలో నటించింది. అర్విజ్ మరియు గిడియన్ కట్టా  ఈ మూవీ కి సంగీతాన్ని అందించగా , జెన్ నెక్స్ట్ మూవీస్  వారు ఈ మూవీ ని నిర్మించారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: