దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ మూవీ లో  ప్రతినాయకుడి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈగ సినిమా ద్వారా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను అలరించిన కిచ్చ సుదీప్ ఆ తర్వాత బాహుబలి , సైరా నరసింహ రెడ్డి లాంటి స్ట్రీట్ తెలుగు మూవీ లలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించాడు.

అలాగే తాను నటించిన కొన్ని మూవీ లను కూడా తెలుగు లో డబ్ చేసి విడుదల చేసి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కిచ్చ సుదీప్ 'విక్రాంత్ రోనా' అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని జూలై 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదల దగ్గర పడటంతో హీరో కిచ్చ సుదీప్ పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ ప్రమోషన్ లను ఇప్పటికే మొదలు పెట్టాడు.

అందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్  , చెన్నై  , కొచ్చి లలో ప్రెస్ మీట్ లను నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాకపోతే చివరి నిమిషంలో చిత్ర బృందం ఈ ప్రెస్ మీట్ లను క్యాన్సల్ చేసింది. దానితో కిచ్చ సుదీప్ మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పాడు. అనారోగ్యం కారణంగా ప్రెస్ మీట్ కి రాలేకపోతున్నాను అని త్వరలోనే అందరిని కలుస్తాను అని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: