రవితేజ హీరో గా నటిస్తున్న తాజా సినిమా రామారావు ఆన్ డ్యూటీ. రేపు ఈ సినిమా విడుదల కాబోతుండగా సినిమాపై మంచి నమ్మకం పెట్టుకుంది చిత్రబృందం. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆమె అందాలు ఈ సినిమా కు బాగా ఉపయోగపడతాయి అంటున్నారు. తెలుగు లో మజిలీ సినిమాలో హీరోయిన్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మళ్ళీ అవకాశాన్ని అందుకోవడానికి చాలా సమయాన్నే తీసుకుంది. మరి అందివచ్చిన ఈ అవకాశాన్ని ఆమె ఏవిధంగా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. ఇప్పటివరకైతే ఆమె గురించి ఎలాంటి లీకేజ్ కూడా జరగలేదు.

సినిమాలో ఆమె పాత్ర బాగానే ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా లో మరో హీరోయిన్ కూడా నటిస్తుండి. వీరిద్దరూ పాత్రలు ఎంతో కీలకం కాబోతున్నాయి. ఇకపోతే ఈ సినిమా నుంచి ఓ వీడియో ఒకటి లీక్ అయ్యి సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. అదెలా బయటకు వచ్చిందో తెలీదు కానీ ఆ వీడియో ని బట్టి సినిమా వేరే లెవెల్లో ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. మంటలమధ్య రవితేజ ను చూస్తుంటే తప్పకుండ మాస్ ను ఆకట్టుకునే అంశాలు గట్టిగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వచ్చిన అప్డేట్ లు ఈ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా అనేది చూడాలి.

ఇకపోతే రవితేజ గత సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఖిలాడీ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదల కాగా అది ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ సినిమారవితేజ తప్పకుండా మరో విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలా ఎన్నో అంచనాల మధ్య ఈ రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ చేస్తున్న సినిమాల లిస్ట్ బాగానే ఉంది అని చెప్పవచ్చు. ఇప్పటికే ధమాకా, రావణాసుర సినిమాలను పూర్తి చేసిన రవితేజ ఆ తర్వాత టైగర్ నాగేశ్వర రావు సినిమా ను చేయడానికి సిద్ధమవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: