టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన నితిన్ ఆఖరుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నభా నటేష్ హీరోయిన్ గా తమన్నా ప్రతినాయకి పాత్రలో తెరకెక్కిన మాస్ట్రో మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . ఈ సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదలై ప్రేక్షకుల బాగానే అలరించింది .

ఇలా ఆఖరుగా మాస్ట్రో మూవీ తో ప్రేక్షకులను అలరించిన నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజక వర్గం అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు . ఈ మూవీ కి ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండ గా,  సముద్ర ఖని ఈ మూవీ లో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లో క్యాథరీన్ మరియు కృతి శెట్టి నితిన్ సరసన హీరోయిన్ లుగా నటించగా ,  మహతి స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ మూవీ కి మహతి స్వర సాగర్ అందించిన పాట లలో నుండి రెండు పాటలను మూవీ యూనిట్ విడుదల చేయగా ఈ రెండు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాను ఆగస్ట్ 12 తేదీన గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేది దగ్గర పడటంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను జూలై 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను జూలై 30 వ తేదీన రాత్రి 7 గంటల 43 నిమిషాలలు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లో నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: