మాస్ మహారాజా రవితేజ ఈ సంవత్సరం విడుదల అయిన ఖిలాడి సినిమాతో తన అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా తీవ్ర నిరుత్సాహపరిచాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఖిలాడి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది.

ఇలా ఖిలాడి మూవీ అపజయం తర్వాత రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా తాజాగా థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ సినిమాకు శరత్ మండవ దర్శకత్వం వహించగా , వేణు తొట్టెంపూడి చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో  నటించాడు. ఈ మూవీ లో వేణు తొట్టెంపూడి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ మూవీ లో రవితేజ సరసన రాజిష విజయన్ , దివ్యాంశ కౌశిక్ కథానాయకులుగా నటించారు. జూలై 29 వ తేదీన మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు బాక్సా ఫీస్ దగ్గర మూవీ యూనిట్ ఆశించిన రేంజ్ కలెక్షన్ లు దక్కడం లేదు. ఇప్పటి వరకు 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాధించిందో తెలుసుకుందాం.

నైజాం : 1.30 కోట్లు , సీడెడ్ : 69 లక్షలు , యూ ఏ : 60 లక్షలు , ఈస్ట్ : 41 లక్షలు , వెస్ట్ : 21 లక్షలు , గుంటూర్ : 35 లక్షలు , కృష్ణ : 31 లక్షలు , నెల్లూర్ : 16 లక్షలు , 5 రోజులకు గాను రామారావు ఆన్ డ్యూటీ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో 4.03 కోట్ల షేర్ , 6.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 0.33 కోట్లు . ఓవర్ సీస్ లో : 47 లక్షలు ప్రపంచ వ్యాప్తంగా 5 రోజులకు గాను రామారావు ఆన్ డ్యూటీ మూవీ 4.83 కోట్ల షేర్ , 8.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: