పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రస్తుతం ప్రాజక్ట్ కె మూవీ తెరకెక్కుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనె ఆయనకు జోడీగా నటిస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ నిర్మస్తుండగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇందులో ఒక కీలక రోల్ చేస్తున్నారు. భారీ విజువల్స్ తో హై టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ప్రాజక్ట్ కె పై మొదటి నుండి అటు ఆడియన్స్ లో అలానే ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి.

ఈ మూవీలో ప్రభాస్ ఒక యువ సైంటిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీగా రూపొందుతున్న ప్రాజక్ట్ కె గురించి ఇటీవల అశ్వినీదత్ మాట్లాడుతూ దీనిని హాలీవుడ్ మూవీ అవెంజర్స్ తో పోల్చారు. ఇండియన్ మూవీ పై భారీ వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని ఇంటర్నేషల్ స్థాయిలో మరిన్ని దేశాల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఈ మూవీకి సంబంధించి టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న ఒక సంచలన వార్తఏమిటంటే, ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద  సినెమాలన్నిటినీ మించి ప్రాజక్ట్ కె కి బడ్జెట్ కేటాయించారట.

కొందరు అయితే ఏకంగా ఈ మూవీకి దాదాపుగా వెయ్యి కోట్లవరకు ఖర్చు చేస్తున్నట్లుచెప్తున్నారు. కానీ పక్కాగా మూవీ పూర్తి అయ్యే సమయానికి ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ అవుతుందని, ఏ విధంగా చూసినా ఇది ఇండియన్ మూవీస్ లో అత్యధిక బడ్జెట్ అని అంటున్నారు. నిజంగా ఇది ఊహించని విషయమే, అయితే మూవీ స్టోరీ, స్క్రిప్ట్ పై ఎంతో గట్టి నమ్మకం  ఉండడం వల్లనే అశ్వినీదత్ కూడా అంత డేరింగ్ గా ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. కాగా ఈ మూవీ 2023 చివర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: