పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎన్నో హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన భీమ్లా నాయక్ మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు.

అలాగే ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ మూవీ కి కమిట్ అయి ఉన్నాడు. అలాగే సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కి తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయ సీతం మూవీ కి రీమేక్ గా తెరకెక్కబోయే సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ మూవీలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నాడు.  అలాగే చాలా రోజుల క్రితం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించడానికి పవన్ కళ్యాణ్ గురించి సిగ్నల్ ఇచ్చాడు. ఇలా వరుస సినిమాలు ఇప్పటికే లైన్ లో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ మరో క్రేజీ దర్శకుడు తో కూడా ఒక సినిమాను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి మూవీ తో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో నటించబోతున్నట్లు, ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరి కొన్ని రోజుల్లో వెలువడనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: