నిన్ననే సీతా రామం సినిమా విడుదల అయ్యింది. మంచి పాజిటివ్ టాక్ కూడా సంపాదించుకుంది. అసలు ఏ ఒక్కరూ కూడా ఈ సినిమా గురించి నెగటివ్ గా మాట్లాడట్లేదు. అయితే థియేటర్లలో వస్తున్న టాక్ కు, ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లకు మాత్రం అస్సలు పొంతన ఉండడం లేదు.సీతారామం సినిమాకు హిట్ టాక్  అయితే వచ్చింది. కాకపోతే దుల్కర్ సల్మాన్ హీరో కాబట్టి ఈ సినిమాకి పెద్దగా బజ్ లేదు. దీంతో అడ్వాన్స్ గా టికెట్లు కూడా తెగలేదు. పైగా పోటీగా బింబిసార సినిమా దిగింది. ఈ నేపథ్యంలో.. సీతారామం సినిమాకు ఓపెనింగ్స్ కూడా పూర్తిగా పడిపోయాయి. మొదటి రోజు ఏపీ ఇంకా నైజాం కలిపి కేవలం కోటిన్నర షేర్ మాత్రమే వచ్చింది.బింబిసార సినిమా దెబ్బకు సీతారామం చిత్రానికి థియేటర్లు దొరకలేదు. తెలుగు రాష్ట్రాల్లో బింబిసార సినిమాకు 685కు పైగా థియేటర్లు దొరికితే, సీతారామం సినిమాకు కేవలం 350 థియేటర్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఆల్రెడీ విక్రాంత్ రోణ, థాంక్యూ ఇంకా రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు మార్కెట్లో ఉండడంతో ఆ ప్రభావం సీతారామం సినిమాపై పడింది. ఇలా తక్కువ థియేటర్లు దొరకడం వల్ల దుల్కర్ సల్మాన్ చిత్రానికి ఓపెనింగ్స్ తగ్గిపోయాయి.


నిజానికి ఈ విషయంలో అయితే నిర్మాత అశ్వనీదత్ ఆలోచన మరో విధంగా ఉంది. ముందుగా ఇలా లిమిటెడ్ గా సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచన ఆయనదే. మంచి టాక్ వస్తే థియేటర్లు పెంచుదామని వారు అనుకున్నారు. ఇంకా గతంలో మహానటి సినిమాకు కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. హిట్ టాక్ తర్వాత అప్పుడు మహానటికి చాలా థియేటర్లు అనేవి అందుబాటులోకి వచ్చాయి. కానీ, ఇప్పుడు హిట్ టాక్ వచ్చినా కూడా సీతారామంకు థియేటర్లు దొరికే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పై అందరి దృష్టి పడింది.హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 11.50 కోట్ల రూపాయల వసూళ్లు రావాలి. మొదటి రోజు వసూళ్లతో కంపార్ చేసి కనుక చూసుకుంటే, బ్రేక్ ఈవెన్అనేది కాస్త అనుమానమే. కాకపోతే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు పోటెత్తుతారని యూనిట్ చాలా ఆశగా ఎదురుచూస్తోంది.ఈ సినిమాకు ఏ స్థాయిలో వసూళ్లు వస్తాయనేది ఇక ఈ వీకెండ్ తో తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: