‘పుష్ప 2’ పై రోజురోజుకి అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనితో ఈమూవీ కథ విషయమై సుకుమార్ చాల జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సీక్వెల్ కథ గురించి ఒక స్పెషల్ రైటర్స్ టీమ్ సుకుమార్ కు అండగా ఈమూవీ కోసం పనిచేస్తోంది అంటే ఈమూవీ కథ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో అర్థం అవుతుంది.


ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న లీకుల ప్రకారం ‘పుష్ప 2’ మూవీ ప్రారంభం అయిన 20 నిముషాలకే రష్మిక నటిస్తున్న శ్రీవల్లి పాత్ర ముగిసి పోతుందట. అయితే శ్రీవల్లి సహజ మరణం కాకుండా పుష్ప రాజ్ ను వ్యతిరేకిస్తున్న కొంతమంది విలన్స్ చేతిలో శ్రీవల్లి పాత్ర చనిపోతుండట. అయినప్పటికీ ఆమె పాత్ర ఆమె ఆత్మ రూపంలో మూవీ అంతా నడిపిస్తుందట. శ్రీవల్లి ఆత్మ సమంతలో ప్రవేశించి ‘పుష్ప 2’ మూవీ కథను నడిపిస్తుందని తెలుస్తోంది. వాస్తవానికి ‘పుష్ప’ మూవీలో సమంతకు ఎటువంటి పాత్రలేదు.


కేవలం ఒక ఐటమ్ సాంగ్ క్రియేట్ చేసి ఆమెను ‘పుష్ప’ మూవీలో భాగస్వామిగా చేసారు. అయితే ఇప్పుడు సమంత ను ‘పుష్ప 2’ లో ఒక కీలకపాత్రలో కనిపించే విధంగా సుకుమార్ కథలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. దీనికితోడు సమంతకు బాలీవుడ్ లో కూడ మంచి ఇమేజ్ వచ్చిన నేపద్యంలో ఆమె క్రేజ్ ‘పుష్ప 2’ కు అన్నివిధాల పనికివస్తుందని సుకుమార్ ఆలోచన అని అంటున్నారు.


ఈ సీక్వెల్ స్క్రిప్ట్ ఫైనల్ అయినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో షూటింగ్ ల నిలుపుదల వ్యవహారం కొనసాగుతున్న పరిస్థితులలో ఈ వ్యవహారాలూ అన్నీ చక్కబడే వరకు ‘పుష్ప 2’ షూటింగ్ ప్రారంభం కాకపోవచ్చు అని అంటున్నారు. అయితే ఈమూవీని ఏదోవిధంగా వచ్చేఏడాది సమ్మర్ కు విడుదల చేయాలి అని అల్లు అర్జున్ సుకుమార్ కు టార్గెట్ ఇస్తున్నప్పటికీ వచ్చే ఏడాది సమ్మర్ కు ఈసినిమా విడుదల అవ్వడం కష్టం అనే వాదన కూడ ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: