ఈ చిత్రంతో ఎలాగైనా సక్సెస్ సొంతం చేసుకోవాలని చాలా ఆత్రుతతో ఉన్నాడు హీరో మంచు విష్ణు. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటూ ఉన్నారు ఇటీవలే బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో కూడా ఒక స్పెషల్ సాంగ్ ని కంపోజ్ చేయడం జరిగింది అందుకు సంబంధించిన ఫోటోలు గా మారాయి. ఇక అంతే కాకుండా డాన్స్ మాస్టర్ అయిన ప్రభుదేవా తో కూడా ఒక పాటకు డాన్స్ కంపోజ్ చేయడం జరుగుతోంది.
ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమాలో నటించిన హీరోయిన్ల క్యారెక్టర్ ని రిలీఫ్ చేస్తూ తాజాగా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు. ఇక ఇందులో మంచు విష్ణు గాలి నాగేశ్వరరావుగా నటిస్తూ ఉన్నారు. సన్నీలియోన్ రేణుక పాత్రలో చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉన్నది ఇక పాయల్ రాజ్ కూడా స్వాతి పాత్రలో నటిస్తూ ఉన్నది. ప్రస్తుతం సన్నీలియోన్ కు సంబంధించి ఒక పోస్టర్ నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇక ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగులో పాటు తమిళ్ మలయాళం హిందీ వంటి భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి