సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు వస్తుంటారు , పోతుంటారు. కానీ కొంత మంది ముద్దుగుమ్మలు మాత్రం ఇతర మొదటి మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకొని వరుస అవకాశాలను కూడా దక్కించుకుంటారు. అలాంటి వారిలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అనుపమ పరమేశ్వరన్ నితిన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ ఆ' మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి మొదటి మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో దక్కించుకొని ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. 

ఇది ఇలా ఉంటే అనుపమ పరమేశ్వరన్ తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఆగస్ట్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ మూవీ తో అనుపమ పరమేశ్వరన్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే వరుస సినిమాలతో తన అభిమానులను అలరిస్తూ వస్తున్న అనుపమా పరమేశ్వరన్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ వారితో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. 

అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా అనుపమ పరమేశ్వరన్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో అనుపమ పరమేశ్వరన్ అదిరిపోయే లుక్ లో సారీ ని కట్టుకొని, స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి, మెడలో ఒక నెక్లెస్ ని వేసుకొని అదిరిపోయే లుక్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: