తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీతారామం. ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా  నటించి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.పోతే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో చిత్ర బృందం థాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు.కాగా  ఈ కార్యక్రమానికి అక్కినేని నాగచైతన్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఇక  ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

అయితే  సీతారామం వంటి సినిమా చేయాలంటే ధైర్యం కావాలని, స్వప్న ప్రియాంకలు అశ్వినీ దత్ గారికి అండగా నిలుస్తున్నారని ఈయన తెలిపారు.ఇక పోతే ఈ సినిమా చూస్తుంటే తనకు చాలా అసూయ కలిగిందని దుల్కర్ సల్మాన్ నటించిన ఈ పాత్రలో తాను నటించాల్సి ఉందని, అసలు నేను చేయాల్సిన రోల్ ఇది అంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.కాగా  ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయని అప్పట్లో తాను నటించినా గీతాంజలి, సంతోషం, మన్మధుడు వంటి సినిమాలు కళ్ళ ముందు కనపడ్డాయని నాగార్జున తెలిపారు.

అయితే ఈ విధంగా ఈ సినిమా థాంక్యూ మీట్ కార్యక్రమంలో భాగంగా సీతారామం సినిమా గురించి అందులో దుల్కర్ సల్మాన్ నటనపై ఈయన ప్రశంసలు కురిపిస్తూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే  ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు నన్ను ఇంతగా ఆదరించినందుకు ప్రేక్షకులందరికీ ఆయన థాంక్యూ తెలియజేశారు.ఇక సీతారామం సినిమా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే యూఎస్ లో ఈ సినిమా వన్ మిలియన్ మార్క్ చేరువలో ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల దిశగా ఈ సినిమా పరుగులు పెడుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: