ఇక రాజమౌళి ఇద్దరు అగ్ర హీరోలను చూపించే విధానంలో కూడా భాగ వర్కౌట్ అయ్యారు అనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ వారి పాత్రలో భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను బాగా అలరించారని చెప్పవచ్చు ఇక పలు అవార్డుల వేడుకలలో కూడా ఇప్పుడు ఈ సినిమా పేర్లు చర్చనీయాంశంలో మారుతున్నది. సైన్స్ ఫిక్షన్ హర్రర్ అలాగే ఫాంటసీ చిత్రాలను గౌరవించే సాటర్న్ అమెరికన్ అవార్డులలో ఈ చిత్రం నామినేట్ చేయబడినట్లు తెలుస్తోంది.
ఇక rrr సినిమా విజువల్స్ ఎఫెక్ట్ సూపర్వైజర్ వర్క్ గా చేసిన శ్రీనివాస్ మోహన్ కూడా ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు rrr సినిమా దర్శకత్వం ఉత్తమ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అని మూడు విభాగాలు ఈ సినిమా నామినేట్ చేయబడింది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డు వేడుకలలో ఈ తెలుగు సినిమా నామినేట్ కావడం ఒక హిస్టారికల్ ఫిట్ అని చెప్పవచ్చు. ఈ అవార్డులను అక్టోబర్ 25న ప్రకటిస్తారు మరి ఈ వేడుకలలో rrr చిత్రం అవార్డులను ఏదైనా సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉన్నది.