టాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి కొడుకుగా ఆయన సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తూ..ఇంకా తన తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ యువ మ్యూజిక్ కంపోజర్‌ కాలభైరవ. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ దేవి శ్రీ ప్రసాద్, ఎస్ ఎస్ తమన్ మధ్య ఇప్పటికే చాలా గట్టి పోటీ వుంది. ఇక మణిశర్మ కూడా ఈమధ్య తన మ్యూజిక్ తో మునుపటి వైభవంతో దూసుకుపోతున్నారు. ఆయన కొడుకు మహతి స్వర సాగర్ కూడా మాస్ బీట్స్ తో అదరగోడుతున్నాడు.ఇంత మంది మ్యూజిక్ డైరెక్టర్ల పోరులో ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతున్నాడు కాల భైరవ.ఈ సంగీత దర్శకుడు తాజాగా మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నాడు. నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కాలభైరవ అందించిన బీజీఎం స్కోర్ మరో స్థాయికి తీసుకెళ్లిందని అంటున్నారు సినీ జనాలు అందరూ కూడా.ఇక తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ షో పడిన తర్వాత కాలభైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌పై జనాల ప్రశంసల వర్షం కురుస్తోంది.


మంచి అడ్వెంచర్ థ్రిల్లర్‌గా సాగే కథకు కాలభైరవ స్కోర్ బ్యాక్ బోన్‌గా నిలిచిందనడంలో అసలు ఎలాంటి సందేహం లేదు. ఇవాళ హైదరాబాద్‌లో కాలభైరవ అంకుల్ ఎస్ఎస్ రాజమౌళి, ఇంకా తండ్రి కీరవాణి  కార్తికేయ 2 సినిమాను వీక్షించారు. సినిమాకు చాలా అద్బుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన కాలభైరవను హ్యాపీ మూడ్‌లో హగ్ చేసుకున్నారు. ఇప్పుడీ న్యూస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.కాలభైరవ సంగీతం అందించిన కలర్‌ఫొటో కూడా ఇటీవలే నేషనల్ అవార్డు సైతం అందుకుంది. ప్రస్తుతం డజన్‌కుపైగా సినిమాలు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ ఖాతాలో ఉన్నాయి.అలాగే రాబోయే కాలంలో తండ్రికి గట్టి పోటీనివ్వడం ఖాయమని అనుకుంటున్నారు మ్యూజిక్ లవర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: