మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.ఇటీవల ఆయన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించిన ఈయన... ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు.అయితే  ప్రస్తుతం ఈయన ఖాళీగా ఉన్నారు. ఇక ఆర్ సి 15 షూట్ కి గ్యాప్ రావడంతో ఆయనకు విరామం దొరికింది. ఇకపోతే భారతీయుడు 2 షూటింగ్ తిరిగి ప్రారంభించిన శంకర్ రామ్ చరణ్ మూవీని తాత్కాలింగా పక్కన పెట్టాడు.కాగా కమల్ హాసన్ హీరోగా శంకర్ చాలా కాలం క్రితమే భారతీయుడు 2 స్టార్ట్ చేశారు. 

అయితే నిర్మాతలతో దర్శకుడు శంకర్ కి ఏర్పడిన వివాదాల కారణంగా మూవీ డిలే అయ్యింది. ఇక ఈ ప్రాజెక్ట్ దాదాపు వదిలేద్దాం అనుకుంటున్న తరుణంలో విక్రమ్ సక్సెస్ ప్రాజెక్ట్ కి ఊపిరి పోసింది. కాగా కమల్ విక్రమ్ మూవీతో వందల కోట్లు కొల్లగొట్టాడు.అయితే కమల్ స్టామినా ఏమిటో నిరూపించిన విక్రమ్ ఆయన మార్కెట్ కి ఎలాంటి ఢోకా లేదని రుజువు చేసింది. ఇక దీంతో నిర్మాతలు భారతీయుడు 2 పూర్తి చేసి విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేవరకు రామ్ చరణ్ ఫ్రీగా ఉంటారు.  ఖాళీ సమయాన్ని రామ్ చరణ్ వెకేషన్ కోసం వినియోగిస్తున్నారు.

ఇదిలావుంటే  సిస్టర్స్ శ్రీజ, సుస్మిత, వాళ్ళ పిల్లలతో పాటు రామ్ చరణ్ టూర్ కి వెళ్ళాడు. అంతేకాదు ప్రత్యేక విమానంలో విహారానికి చెక్కేశారు.ఇకపోతే బిజీగా ఉన్న ఉపాసన ఈ టూర్ మిస్ అయ్యారు. ఇక దీంతో రామ్ చరణ్ ని మిస్ అవుతున్నట్లు ఉపాసన సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు.అయితే  రామ్ అండ్ రైమ్ ని చాలా మిస్ అవుతున్నట్లు తెలియజేశారు. కాగా రైమ్ రామ్ చరణ్ పెట్ డాగ్ కాగా... దాన్ని వదిలి ఆయన అసలుండరు.అయితే  ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ టైం లో రైమ్ ని తీసుకొని రామ్ చరణ్ దేశం మొత్తం తిరిగారు.రామ్ చరణ్ ని ఉపాసన ఎంతగా మిస్ అవుతున్నారో తెలిసి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అంతేకాదు వదిన కూడా వెళితే బాగుండేది అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: