టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ తనకు సినిమా షూటింగ్లలో ఏమాత్రం విరామ సమయం దొరికిన ఎక్కువగా తన కొడుకు కూతురుతో సమయం గడపడానికి ఇష్టపడతారు. ఇలా విరామ సమయంలో తన ఫ్యామిలీతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లడం లేదా లాంగ్ డ్రైవ్ వెళ్లడం చేస్తుంటారు.

ఇకపోతే అర్హ ఇప్పటికే సోషల్ మీడియాలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఈమె ముద్దు ముద్దు మాటలకు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ అర్హత కలిసి ఉన్న ఒక క్యూట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో అల్లు అర్హ అడిగే ప్రశ్నలకు అర్జున్ సమాధానాలు చెప్పలేకపోయారు. ఈ వీడియోలో భాగంగా అల్లు అర్హ పొడుపు కథలు అడుగుతూ అల్లు అర్జున్ ని ప్రశ్నించారు.

గంగిగోవు పాలు గరిటడైన చాలు అంటూ పొడుపు కథ వేయగా అందుకు అల్లు అర్జున్ వెంటనే సమాధానం చెప్పారు.అలాగే అల్లు అర్హ అల్లు అర్జున్ కి టంగ్ ట్విస్టర్ ఇచ్చారు. 7 నల్ల లారీలు.. ఏడు తెల్ల లారీలు అంటూ ఫాస్ట్ గా చెప్పమని అడిగారు. అయితే అల్లు అర్జున్ తన కూతురు చెప్పిన విధంగా చెప్పకపోవడంతో ఒక్కసారిగా నవ్వేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది నేటిజన్స్ ఈ వీడియో చూసి అర్హ మామూలుది కాదు ఏకంగా అల్లు అర్జున్ కి ప్రశ్నలతో ముప్పతిప్పలు పెడుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అల్లు అర్హ ఇప్పటికే వెండితెర ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. సమంత నటించిన శాకుంతలం సినిమాలో ఈమె భరతుడు చిన్నప్పటి పాత్రలో నటించారు. సోషల్ మీడియా వేదికగా అర్హకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: