గత కొన్నేళ్లలో పూరి జగన్నాధ్ నుంచి వచ్చిన సాలిడ్ ఫిలిం ఏదైనా ఉందంటే అది 'ఇస్మార్ట్ శంకర్' అనే చెప్పవచ్చు.. ఈ సినిమా తరువాత అభిమానులకు మళ్లీ ఆయనపై నమ్మకం పెరిగింది.


ఈ సినిమాను చూసే విజయ్ దేవరకొండ.. పూరికి డేట్స్ ఇచ్చారు. కానీ విజయ్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు పూరి. వీరి కాంబినేషన్ లో వచ్చిన 'లైగర్' డిజాస్టర్ అయింది. కనీసం సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చినా కానీ విజయ్ తన పెర్ఫార్మన్స్ తో నెట్టుకొచ్చేవాడు.


కానీ పూరి రాసుకున్న కథ, కథనాల్లో సత్తా లేకపోవడంతో విజయ్ కష్టం కూడా సినిమాను కాపాడలేకపోయింది. ఈ సినిమా దెబ్బకి పూరి పరిస్థితి దారుణంగా తయారైంది. స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే.. మిడ్ రేంజ్ హీరోలు కూడా పూరికి డేట్ ఇవ్వడానికి భయపడుతున్నారట.ఇలాంటి పరిస్థితుల్లో తన కొడుకు ఆకాష్ తో పూరిసినిమా చేయబోతున్నట్లుగా ఇటీవల ప్రచారం కూడా జరిగింది. దాని గురించి క్లారిటీ లేదు.


 


కానీ ఇంతలోపు పూరి జగన్నాధ్ దృష్టి రామ్ పై పడిందనే మాటలు వినిపిస్తున్నాయి. పూరి వరుస ప్లాప్స్ లో ఉన్నప్పుడు అతడిని నమ్మి 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చేశారు రామ్. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇద్దరి కెరీర్లకు ప్లస్ అయింది. ఈ సినిమాకి సీక్వెల్ చేస్తామని అప్పట్లో పూరి-రామ్ ప్రకటించారు కూడా. కానీ తరువాత ఇద్దరూ వేర్వేరు ప్రాజెక్ట్స్ బిజీ అయ్యారు.


 


ఇప్పుడు పూరికి మరో హీరో దొరికేలా లేరు. 'ది వారియర్' సినిమాతో ప్లాప్ అందుకున్న రామ్.. ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే రామ్ ని కలిసి అతడితో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయాలని అనుకుంటున్నారట పూరి. రామ్ ఎప్పుడు డేట్స్ ఇస్తారో దాన్ని బట్టి సినిమా చేయాలనుకుంటున్నారట.. 'ఇస్మార్ట్ శంకర్ 2' కోసమే వీరిద్దరూ కలిసే ఛాన్స్ అయితే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: