"ఆడదాన్ని ఉసిరు తగిలితే ఎలాంటి రాజ్యాలైనా సరే కూలిపోతాయి" అని గతంలో చాలామంది చెప్పుకొచ్చారు. బహుశా ఈ హీరో విషయంలో అదే జరిగిందేమో .
మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరో శింబు తన లైఫ్ లో ఎలాంటి చేదు రోజులను చూశాడో, ఏ హీరో కూడా మోయలేని నిందలని అనుభవించాడు కోలీవుడ్ హీరో శింబు. కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న శింబు తనదైన స్టైల్ లో కోలీవుడ్లో సినిమాలు చేస్తూ ..ఆ సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి తెలుగు ప్రేక్షకుల చేత కూడా శభాష్ అనిపించుకున్నాడు. అంతే కాదు క్రమీణ తన సినిమాలకు ఇక్కడ కూడా మార్కెట్ పెంచుకొని తెలుగు జనాలను మెప్పించాడు.

అయితే కెరియర్ స్టార్టింగ్ లోనే శింబు కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార తో నడిపిన యవ్వారం అప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. పాపం అందరూ దాన్ని ప్రేమ అనుకున్నారు. శింబు తో కలిసి సినిమా లో నటించిన టైంలో ఇద్దరు చేసిన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వామ్మో మరి కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకునేస్తారు ఏమో అనుకున్నారు అంతా. అంతలా రాసుకొని పూసుకుని తిరిగారు. అంతేనా లిప్ కిస్సులు పెట్టుకుంటూ బుగ్గలు బుగ్గలు రాసుకుంటూ పబ్లిక్ గా ఆ వీడియో బయట హల్చల్ చేసింది. అంతలా వీళ్ళిద్దరూ బరితెగించి ప్రవర్తించారు.
అయితే ప్రైవేటుగా తీసుకున్న నయనతార శింబు లిప్ లాక్ వీడియో ఎలా సోషల్ మీడియాలోకి లీక్ అయింది అనేదానిపై అప్పట్లో ఓ చర్చ ఘాటుగా సాగింది. అయితే అందరూ కూడా శింబునే కావాలని నయనతార ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని చెప్పి ఆ వీడియోని బయటపెట్టినట్లు అప్పట్లో కోలీవుడ్ మీడియాలో చెప్పుకొచ్చారు . నిజానికి ఈ వీడియో లీక్ అయిన తర్వాత నయనతార చాలా ఇబ్బందులు ఎదుర్కొంది . సినిమా ఇండస్ట్రీలో సగం పరువు పోగొట్టుకునింది .

ఆ తర్వాత ఆమెకున్న టాలెంట్ తో బయటపడ్డింది. శింబుకు మాత్రం ఒకానొక టైంలో కెరియర్ పతనం అయిపోయిందనే రేంజ్ కి దిగిపోయాడు. ఈ మధ్యనే మళ్లీ పుంజుకుంటున్నాడు . దీంతో నయనతార ఉసురే హీరోకి శాపంగా మారింది అంటూ కోలీవుడ్ జనాలు చెప్పుకునే స్థాయికి వెళ్లిపోయింది .ప్రజెంట్ నయనతార భర్తతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే ..శింబు మాత్రం తాను పనిచేసే సినిమాలలో హీరోయిన్లతో ఎఫైర్లు నడుపుతూ ఉంటాడని కోలీవుడ్ మీడియా రాసుకోస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: