వచ్చేవారం దసరా నాడు విడుదలకాబోతున్న ‘గాడ్ ఫాదర్’ మూవీ ట్రైలర్ ను చూసిన వారు మళయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ ను పూర్తిగా మార్చేసారా అన్న సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి. వాస్తవానికి ‘లూసీఫర్’ మూవీలో హీరో మోహన్ లాల్ ఎలివేషన్ కన్నా ఆసినిమాలోని సన్నివేశాల ఎలివేషన్ చాల ఎక్కువగా ఉంటుంది.



అయితే రీమేక్ గా విడుదల కాబోతున్న ‘గాడ్ ఫాదర్’ మూవీలో సన్నివేశాల ఎలివేషన్ కన్నా చిరంజీవి పంచ్ డైలాగుల ఎలివేషన్ చాల ఎక్కువగా ఉండబోతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి పంచ్ డైలాగ్స్ ను గతంలో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేవారు. అయితే ఇప్పుడు సగటు ప్రేక్షకుడు తాను చూసే సినిమాలో ఎక్కువగా సహజత్వం కోరుకుంటున్న పరిస్థితులలో ఈ పొలిటికల్ పంచ్ డైలాగ్స్ కోసం ఈ సినిమాను ఒకటికి రెండు సార్లు చూస్తారా అన్న సందేహాలు కూడ కొందరికి ఉన్నాయి.


‘ప్రజారాజ్యం’ పార్టీ పరాజయం తరువాత చిరంజీవి నోటివెంట మళ్ళీ ఎప్పుడు రాజకీయాల మాటరాలేదు. అయితే 12 సంవత్సరాల తరువాత తిరిగి చిరంజీవి మనసు రాజకీయాల వైపు మళ్ళుతోందా అన్న సందేహాలు ‘లూసీఫర్’ ట్రైలర్ ను చూసినవారికి కలుగుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే భారీ వర్షం పడుతున్న లెక్కచేయకుండా తన పై పెట్టిన గొడుగును కూడ తీసివేసి ‘లూసీఫర్’ పొలిటికల్ పంచ్ డైలాగ్స్ చిరంజీవి మైక్ పుచ్చుకుని ఆవేశంగా చెప్పడంతో 68 సంవత్సరాల చిరంజీవిలో ఏమాత్రం ఉత్సాహం తగ్గలేదు అని చూసిన వారికి అనిపిస్తుంది.


వాస్తవానికి చిరంజీవి అభిమానులు కోరుకునేది మాస్ సినిమా అలాంటి మాస్ లక్షణాలు ఈ మూవీలో చాల ఎక్కువగా ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. ‘ఆచార్య’ ఘోర పరాజయం తరువాత చిరంజీవి నుండి వస్తున్న మాస్ సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే చిరంజీవి బాడీ లాంగ్వేజ్ డైలాగ్స్ కూడ ఉండటంతో ఈమూవీకి అత్యంత భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అని అనిపిస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: