టాలీవుడ్ సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం (సెప్టెంబర్‌ 28) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.ఇకపోతే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి.. హైదరాబాద్‌లోని నివాసంలో కన్నుమూశారు.ఇక  ఈ ఏడాది జనవరిలో ఇందిరా దేవి పెద్ద కుమారుడు రమేష్‌ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. అయితే ఇంతలోనే ఇందిరా దేవి కన్ను మూయడంతో మహేష్‌ బాబు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.ఇక ఇందిరా దేవి మృతికి సినీ, 

రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా వెంకటేష్, మంచు మోహన్‌ బాబు, నాగార్జున, మంచు విష్ణు, దగ్గుబాటి రానా, అడివి శేషు, విజయ్‌ దేవరకొండ, గోపీచంద్, జీవితా రాజశేఖర్ తదితరులు ఇందిరా దేవి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అంతేకాదు ప్రతిఒక్కరు కృష్ణ, మహేష్‌ బాబు, నమ్రతా శిరోద్కర్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.అయితే మహేష్ బాబు ఇంటికి రాలేని పరిస్థితిలో ఉన్న వారు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. అయితే ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మాత్రం ఈరోజు ఓ ట్వీట్ చేశారు. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న 'మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా అమ్మా' అని నేషనల్ క్రష్ ట్వీటారు. ఇకపోతే ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది.అయితే  ఈ ట్వీట్ చూసిన సూపర్ స్టార్ ఫాన్స్ రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు నిన్న ఎటు పోయారు మేడమ్, ఇప్పుడే లేచావా తల్లి అంటూ విమర్శలు చేస్తున్నారు.ఇదిలావుంటే ఇక  'సరిలేరు నీకెవ్వరూ' సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక నటించిన విషయం తెలిసిందే.ఇకపోతే టాలీవుడ్ స్టార్ హీరో అయిన మహేష్ బాబు కూడా ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు అన్న సంగతి అందరికీ తెల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: