తెలుగు బుల్లి తెర ప్రారంభం రోజుల్లో యాంకర్ గా ఉదయ భాను ఏ స్థాయిలో సక్సెస్ అయిందో మనందరికి తెలిసిందే. అయితే.ప్రస్తుతం సుమ ఎంత బిజీగా ఉంటుందో… ఎంత భారీ పారితోషికం తీసుకుంటుందో అంత బిజీగా అంత ఎక్కువ పారితోషికం అప్పట్లో ఉదయ భాను తీసుకునేది.ఇక అప్పటి మార్కెట్ ని బట్టి.. అప్పటి బిజినెస్ లెక్కల ప్రకారం చూస్తే ఉదయ భాను రెమ్యునరేషన్ ఏకంగా హీరోయిన్స్ రేంజిలో ఉండేది అనడంలో సందేహం లేదు. అయితే ఉదయ భాను కెరియర్ అంతా సాఫీగా సాగుతోంది, 4 సినిమా ఫంక్షన్లో 10 టీవీ కార్యక్రమాలు అన్నట్లుగా ఆమె జోరు మీద ఉన్న సమయంలో అనూహ్యంగా ఆమె జీవితంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి.

కాగా ఆమె పెళ్లి ఒక మిస్టరీ గా జనాల్లో మిగిలి పోయింది. ఇక ఇప్పటికి కూడా పలు పుకార్లు షికారులు చేస్తూనే ఉంటాయి. అయితే జనాల్లో ఉన్న ప్రచారం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే.. ఉదయభాను టీవీల్లో ఎంట్రీ ఇవ్వక ముందే 15వ ఏటా ఒక ముస్లిం వ్యక్తితో పెళ్లి జరిగింది. ఇకపోతే కొన్ని కారణాలవల్ల అతడి నుండి విడిపోయింది.ఇక  ఆ తర్వాత ఒంటరి జీవితం సాగిస్తున్న ఉదయ భానుకి కెరియర్ లో సక్సెస్ బూస్ట్ ఇచ్చినట్లయ్యింది.ఇక మరే  విషయాల గురించి ఆలోచించకుండా కెరియర్ లో ముందుకు వెళుతున్న సమయంలో విజయ్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమ మొదలైంది. ఇక జనాలు అనుకునేది ఏంటంటే.. విజయ్ కుమార్ మొదట్లో ఉదయ భాను వద్ద డ్రైవర్ గా చేసేవాడని.. లేదు ఉదయభాను ఆఫీస్ లో జాబ్ చేసేవాడని రకరకాలుగా అంటూ ఉంటారు. కాగా ఆయన ఏం చేసేవాడో కానీ ఉదయ భాను ని మాత్రం ప్రేమలో పడేశాడు.

అయితే  ప్రేమలో పడ్డ తర్వాత పెళ్లి విషయంలో తల్లితో గొడవలు పడింది.ఇకపోతే ఆ గొడవల కారణంగానే ఉదయ భాను బుల్లి తెర కెరియర్ కాస్త గందరగోళానికి గురైంది అంటూ బుల్లి తెర వర్గాల వారు అంటారు.ఇక  అప్పుడు ఆమె కెరియర్ ని దగ్గర నుండి చూసినవారు ఆమెతో సన్నిహిత్యంగా ఉన్నవారు ఆమె ప్రేమ కారణంగానే బుల్లి తెరపై సందడి తగ్గిందంటూ బలంగా చెబుతూ ఉంటారు.అయితే  ఆమె యొక్క నిర్ణయం సరైనదే కానీ ఆమె తల్లి ఆ సమయంలో ఆమెకు మద్దతు తెలపక పోవడం వల్లే కెరియర్లో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఆమె ఈ స్థాయిలో ఉండవలసి వచ్చింది అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. కాగా ఆమె బుల్లి తెరపై జోరు తగ్గించినా కూడా ఆ తరం ప్రేక్షకులకు ఉదయ భాను అంటే ఒక హీరోయిన్ స్థాయి స్టార్ డమ్‌ ఉన్న యాంకర్ అనడంలో సందేహం లేదు. అయితే ఇప్పటికి కూడా ఆమె బుల్లి తెరపై వస్తే ఒక జోష్‌ కనిపిస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: