టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమాదసరా పండగకు విడుదల అవుతోంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ మధ్యనే అనంతపూర్ లో జరిపారు.మలయాళం బ్లాక్ బస్టర్ మోహన్ లాల్ నటించిన 'లూసిఫర్' సినిమాకి ఈ సినిమా రీమేక్.తమిళ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు.అయితే ఎవరూ ఊహించనంత మంది అభిమానులు ప్రీ రిలీజ్ సభకు రావటం, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అభిమానులు చెక్కు చెదరకుండా అన్ని గంటలసేపు వుండటం చూసి చిరంజీవి చాలా భావోద్వేగానికి గురి అయ్యారు. అందుకే చిరంజీవి కూడా వర్షం లో తడుస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈమధ్య కాలం లో అంతమంది జనాలు ఒక సినిమా ఈవెంట్ కి రావటం కూడా ఇదే. మెగాస్టార్ చిరంజీవి చాలా పాజిటివ్ గా ఆలోచిస్తూ వెళుతుంటే, కొంతమంది మాత్రం చిరంజీవి మీద ఇంకా గాడ్ ఫాదర్ సినిమా పై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. పరిశ్రమలో వున్నవాళ్లే పనిగట్టుకొని ఈ ప్రచారం చేస్తున్నారని ఒక టాక్ నడుస్తోంది. 'గాడ్ ఫాదర్' హిట్ అయితే పరిశ్రమకే కాదు, పరిశ్రమలో వుంటున్న వందలాది కుటుంబాలకు కూడా మంచిది, కానీ ఎందుకో మరి చిరంజీవి మీద ఇలా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు అని పరిశ్రమలో అంటున్నారు.


'ఆచార్య' సినిమా ఫ్లాప్ అయింది, అయితే అన్ని సినిమాలు అలానే వుంటాయా ఏంటి, హిట్ మరియు ఫ్లాప్ అన్నవి పరిశ్రమలో అందరి నటులకు వుంటుందని, అందువల్ల నెగెటివ్ ప్రచారం మంచిది కాదని పరిశ్రమలో అనుకుంటున్నారు.కోవిడ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా పరిశ్రమలో వున్న ఎంప్లాయూస్ కోసం చేసిన సేవ ఎవ్వరూ మర్చిపోకూడదు. అలాగే, ఆ తరువాత కూడా అదే ఎంప్లాయూస్ ఆరోగ్యం కోసం చిరంజీవి తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఎంతో హర్షించదగినవి. ఎప్పుడూ పరిశ్రమ బాగు కోరే చిరంజీవి మీద ఎందుకు పని కట్టుకొని ఒక బ్యాచ్ నెగెటివ్ ప్రచారం చేస్తోందో అర్థం కావటం లేదు అని పేరు చెప్పటం ఇష్టం లేని ఒక నిర్మాత అన్నాడు. అనంతపురం సభకి అంతమంది వస్తారని చిరంజీవి కూడా వూహించలేదు అని, అంతమందిని చూశాక చాలా భావోద్వేగానికి గురయ్యారని చెప్పాడు ఆ నిర్మాత. అలాగే చిరంజీవి గారు చిన్న సినిమాని ప్రోత్సహించాలనే వుద్దేశ్యంతో చాలా సినిమాలకు ముఖ్య అతిధిగా వచ్చి ఆ సినిమా ఈవెంట్ లో పాల్గొన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: