టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీకి సంబంధించి మెజారిటీ సన్నివేశాల షూటింగ్ ఇప్పటికే పూర్తైంది.


అయితే శంకర్ భారతీయుడు2 సినిమాతో బిజీ కావడం ఈ సినిమా పాలిట శాపమైందని బోగట్టా. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 2023 చివర్లో లేదా 2024 ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుందట.


ప్రతి సినిమాను పరిమిత బడ్జెట్ తో నిర్మించే నిర్మాత దిల్ రాజుకు సైతం ఈ సినిమా వల్ల బడ్జెట్ భారం పెరుగుతోందని తెలుస్తోంది. చరణ్ మూవీ షూటింగ్ వేర్వేరు కారణాల వల్ల అంతకంతకూ ఆలస్యం అవుతుండటంతో పాటు ఈ సినిమాకు సంబంధించి ఎన్నో మార్పులు జరుగుతున్నాయని బోగట్టా. చరణ్ వేగంగా సినిమాలు చేస్తే మాత్రమే ఆర్.ఆర్.ఆర్ క్రేజ్ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. చరణ్ శంకర్ కాంబో మూవీ విషయంలో దిల్ రాజు ఒక విధంగా ఆలోచిస్తే మరో విధంగా జరుగుతోందని తెలుస్తోంది.


 


దిల్ రాజు ఇచ్చిన బడ్జెట్ కు శంకర్ ఖర్చు చేయించిన మొత్తానికి సంబంధమే లేకుండా పోయిందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. వైరల్ అవుతున్న వార్తల గురించి దిల్ రాజు స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. చరణ్ సినిమాకు పని చేస్తున్న టెక్నీషియన్లను శంకర్ మారుస్తున్నారని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.


 


ఈ సినిమాకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తలు సినిమా ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్నాయట.దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ విషయంలో స్పందించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో జీ స్టూడియోస్ నిర్వాహకులు, దిల్ రాజు నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: