దసరా సందర్భంగా సినిమాల సందడి కాస్త ఎక్కువగా వుంది..అక్టోబర్‌ 7వ తేదీన అంటే ఈ శుక్రవారం కూడా ఓటీటీల్లో పెద్ద ఎత్తున లు, వెబ్‌ సిరీస్‌లు రిలీజ్‌ కానున్నాయి. ఇప్పటికే ఎలాంటి హడావిడి లేకుండానే ఆమిర్‌ఖాన్‌ నటించిన లాల్‌సింగ్‌ చద్దా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఆమిర్, చైతూ, కరీనాల నటనను మరోసారి వీక్షించాలనుకునేవారికి ఇది మంచి అని చెప్పవచ్చు. ఇక శుక్రవారం కీరవాణి కుమారుడు, యంగ్‌ హీరో శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన దొంగలున్నారు జాగ్రత్త తెలుగు, తమిళ్‌, మలయాళం భాషల్లో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది..


కన్నడలో లక్కీ మ్యాన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కాబోతోంది. ఇందులో దివంగత పునీత్ రాజ్‌కుమార్‌ ఓ కీలక పాత్రలో కనిపించడం విశేషం. వీటితో పాటు గ్లిచ్ అనే ఒక కొరియన్ వెబ్‌ సిరీస్ మొదటి సీజన్, ది జెఫ్రీ డోమర్ టైప్స్ అనే ఇంగ్లిష్ వెబ్ సిరీస్, ది మోల్ సీజన్ వన్ అనే ఇంగ్లిష్‌ వెబ్‌ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం కానున్నాయి. ఇక ఇంగ్లిష్‌ భాషలోని నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్ లలో ది మిడ్ నైట్ క్లబ్, డెర్రీ గర్ల్స్, ఆడ్ బాల్స్, మాన్ ఆన్ పాజ్, వెబ్ సిరీస్ లు స్ట్రీమ్ కాబోతున్నాయి.


అలాగే జపనీస్ భాషలో టైగర్ అండ్ బన్నీ అనే వెబ్ సిరీస్ సీజన్ 2 లోని పార్ట్ 2 విడుదల కాబోతోంది. ఇవి కాక లక్కీయస్ట్ గర్ల్ అలైవ్, ది రిడీమ్ టీం అనే ఇంగ్లిష్ లు, ఓల్డ్ పీపుల్ (జర్మన్‌), డాల్ హౌస్ (ఫిలిపినో) లు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కాబోతున్నాయి..అమెజాన్‌ ప్రైమ్‌లో హిందీ మూవీ మజా మా తో పాటు ది సౌండ్ ఆఫ్ 007 అనే డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విషయానికి వస్తే.. ప్రే అనే ఒక ఇంగ్లిష్ మూవీ రాబోతోంది. హిందీలో కూడా ఆ విడుదల కానుంది..ఇది ఈరోజు రానున్న సినిమాల లిస్ట్.. హ్యాపీగా ఇంట్లోనే కుర్చొని ఎంజాయ్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: