నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే ఛలో మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మీక మండన మొట్ట మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అంతకు మించిన క్రేజ్ ను సంపాదించుకుంది.

రష్మిక మందన ఆ తర్వాత గీత గోవిందం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇది ఇలా ఉంటే రష్మీక మందన తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ గీత గోవిందం మరియు డియర్ కామ్రేడ్ మూవీ లలో విజయ్ దేవరకొండ తో లిప్ కిస్ సీన్ లపై స్పందించండి.

తాజా ఇంటర్వ్యూ లో రష్మిక మందన మాట్లాడుతూ ... మొదటి మూవీ లోని ముద్దుపై అంతగా ట్రోలింగ్ జరగలేదు అని ,  కాక పోతే డియర్ కామ్రేడ్ మూవీ లోని లిప్ కిస్ పై దారుణమైన ట్రోలింగ్ జరిగిందని , పబ్లిసిటీ కోసమే చేశామంటూ విమర్శలు రావడంతో చాలా బాధపడ్డాను అని , చాలా రోజుల పాటు పీడకలలు వచ్చేవి అని , అవి నిజమో కాదు అర్థమయ్యేది కాదు అని , నిద్ర లేచి బెడ్ మీదనే కూర్చొని ఏడ్చేదాన్ని అని రష్మిక మందన తాజా ఇంటర్వ్యూ లో పేర్కొంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీ లో వరస మూవీ లలో నటిస్తూ ఫుల్ జోష్ లో తన కెరీర్ ని ముందుకు సాగిస్తుంది. ఈ ముద్దు గుమ్మ తాజాగా బాలీవుడ్ లో నడిపించిన గుడ్ బై మూవీ మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: