హర్ష సాయి..ఈ పేరు వినగానే మనకు యూట్యూబ్లో ఆయన చేసే సహాయ కార్యక్రమాలు కనిపిస్తాయి.. ఈయన చేసే వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి.
ఈయన గురించి మనలో చాలామంది ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. హర్ష సాయి కి ఒక స్టార్ హీరోకి ఉండే రేంజ్లో అభిమానులు ఉంటారు. ఇక హర్ష సాయి గురించి కేవలం అతని పేరు ఆయన చేసే సహాయాలు తప్పా అతని పర్సనల్ లైఫ్ గురించి ఏ ఒక్కరికీ తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే అతని వ్యక్తిగత విషయాలు బయటికి రానివ్వలేదు. అలాంటి హర్ష సాయి మొదటి సారి తన కుటుంబం గురించి కొన్ని విషయాలను బయట పెట్టారు. విషయంలోకి వెళితే.. హర్ష సాయి యూట్యూబ్ లో చేసే వీడియోలు చూస్తే ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఆయన చేసే సహాయాలు చూస్తే ఎదుటి వారిలో కూడా ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఈయన వీడియోలు చూసి ఎంతోమంది వారికి తోచిన విధంగా సహాయం చేస్తూ వస్తున్నారు.హర్ష సాయి పర్సనల్ విషయంలోకి వెళితే.. ఈయన బీటెక్ పూర్తి చేసి అందరిలా జాబ్ చేస్తే ఏముంది అని అనుకున్నాడో ఏమో కానీ సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలు పెట్టారు. మొదట్లో ఫిట్నెస్, అడ్వెంచర్ వీడియోస్ ని షేర్ చేస్తూ చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. అదే విధంగా చేస్తే కిక్ ఏముంటుంది అనుకున్నాడో ఏమో గాని తన దగ్గర ఉన్న లక్షల డబ్బులు ఫ్రీగా పేదవారికి పంచుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక ఆయన చేసిన సహాయం కు సంబంధించిన వీడియోలకు మిలియన్ లలో వ్యూస్ వస్తాయి. ఇదంతా పక్కన పెడితే..హర్ష సాయి పేరు తప్ప అతని గురించి పర్సనల్ విషయాలు ఏ ఒక్కరికీ తెలియదు. మొదటిసారి ఆపరేషన్ హర్ష సాయి పేరుతో జర్నలిస్ట్ జాఫర్ చేసిన ఓ ఇంటర్వ్యూలో హర్ష సాయి తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. జాఫర్ అడిగిన ప్రశ్నలన్నింటికీ హర్ష సాయి సమాధానం చెబుతూ వచ్చాడు. కానీ ఒక్క ప్రశ్నకు మాత్రం చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే జాఫర్ ఆ ప్రశ్నలో తన అమ్మ గురించి అడిగారు.అమ్మ పేరు వినగానే హర్ష సాయి చాలా ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు కన్నీళ్లు కూడా పెట్టుకోవడం గమనార్హం.హర్ష సాయి ఎంతోమంది పేద వాళ్లకు, అమ్మలకు సాయం చేసినప్పటికీ అతనికి మాత్రం అమ్మ లేదట. అతనికి ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయిందట. హర్ష సాయి వాళ్ళ అమ్మ పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో అతనికి కూడా హర్ష సాయి అని పేరు పెట్టిందట. చిన్న వయసులోనే తన తల్లి చెప్పే బాలవికాస్ క్లాసులు మిగతా పిల్లలతో కలిసి ఈయన కూడా వినే వారట. లైఫ్ అంటే ఎప్పుడు ఏదో ఒక పర్పస్ లో ఉండాలని తన అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేదట. అయితే తన తల్లి మాటలు నిజం చేస్తూ హర్ష సాయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి తన వంతుగా సహాయం చేస్తూ వస్తున్నారు. ఇక తన అమ్మ గురించి జాఫర్ కి హర్ష సాయి చెబుతున్నప్పుడు అతడు తన ఎమోషనల్ ని కంట్రోల్ చేసుకోలేక కళ్ళలో నుండి నీళ్ళు కూడా వచ్చాయి. ఇక హర్ష సాయి కంటతడి పెట్టుకున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: