సినిమా పరిశ్రమలో రాణించాలి అంటే
హీరోయిన్ లకు మంచి టాలెంట్ తో పాటు కొంత అదృష్టం కూడా ఉండాలి. టాలెంట్ కు తగ్గ గ్లామర్ ని చూపిస్తే వారికి మంచి అవకాశాలు రావడం ఖాయం. ఆ విధంగా
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇద్దరు హీరోయిన్లు టాలెంట్ పరంగా మంచి గుర్తింపు పేరు సంపాదించుకున్నప్పటికీ ఆవగింజంత అదృష్టం కూడా లేకపోవడం వారికి
సినిమా అవకాశాలను దూరం చేస్తుంది అని చెప్పాలి.
తెలుగు
సినిమా పరిశ్రమలో
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోగలిగింది నాభ నటేష్. ఆ
సినిమా ఆమెకు తెచ్చి పెట్టిన పేరు అంతా ఇంతా కాదు. మంచి నటిగా గ్లామర్ పంచే కథనాయకగా గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత ఆమెకు అదృష్టం కలిసి రాకపోవడంతో మంచి
సినిమా అవకాశాలు రాలేదు. వచ్చిన
సినిమా లు ఆమెకు సరైన విజయాన్ని తెచ్చిపెట్టకపోవడంతో ఈ ముద్దుగుమ్మకు కెరియర్ పరంగా ఎప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. తాజాగా ఆమె తన అందాల ఆరబోతకు పని చెప్పి సోషల్
మీడియా వేదికగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది
మరొక అందాల
భామ కేతిక శర్మకు కూడా అదృష్టం ఏమాత్రం కలిసి రావడం లేదని చెప్పాలి. ఆమె ఇప్పటివరకు చేసిన మూడు సినిమాల తోనూ ప్రేక్షకులను తన అందచందాలతో ఆలచించినప్పటికీ అవి విజయం సాధించకపోవడం ఈమెకు పెద్దగా పేరు తీసుకురాలేకపోయాయని చెప్పవచ్చు. మొదటి
సినిమా రొమాంటిక్ పర్వాలేదు అనిపించుకున్న కూడా ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు కూడా ఆమెను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి. దాంతో ఆమె
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇకపై
హీరోయిన్ గా కొనసాగుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.వీరు మాత్రమే కాకుండా చాలామంది
హీరోయిన్ లు తమ కష్టానికి ఫలితం దక్కడం లేదని వాపోతున్నారు. వారికి అదృష్టం తీసుకోచ్చె అంశం ఏదై ఉంటుందో మరీ.