ఇక తన కొడుకు నటించబోయే ఒక సినిమా తో నిర్మాతగా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు నాగబాబు ఆస్తులు విలువ ఒకసారి మనం అందరం తెలుసుకుందాం.
జబర్దస్త్ తో పాటు పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరించిన నాగబాబు ఆస్తులు విలువ గత కొన్నేళ్లుగా భారీగా పెరిగిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ విలువల ప్రకారం నాగబాబు ఆస్తి విలువ రూ.120 కోట్ల రూపాయలకంటే ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు మనకు సమాచారం. ఇక కుమారుడు వరుణ్ తేజ్ కూడా ప్రస్తుతం పలు సినిమాలతో చాలా బిజీగా ఉంటూ ఒక చిత్రానికి రూ.12 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక గత ఏడాది విడుదలైన గని సినిమా డిజాస్టర్ కాగా..F-3 సినిమా మాత్రం బాగా సక్సెస్ అందుకుంది.
ఇక ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సర్కారు వారి పాట చిత్రంలో నాగబాబు చిన్న పాత్రలో నటించి మెప్పించారు. ఇక నాగబాబుకు పాత్ర నచ్చితే ఇతర హీరోల సినిమాల లో కూడా నటించడాని కి సిద్ధమే అన్నట్లుగా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం నాగబాబు రోజుకు ఒక్కో చిత్రానికి రూ 5 లక్షల రూపాయలు తీసుకోబోతున్నట్లు సమాచారం. నాగబాబు హీరోగా కంటే పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు గాని మంచి విజయాన్ని అందుకున్నారు మరీ. ప్రస్తుతం నాగబాబుకు సంబంధించి ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి