రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.ఇక వెస్ట్రన్ కంట్రీస్‌లో ఆర్ఆర్ఆర్ మీద ఎంత నెగెటివ్ కామెంట్లు వచ్చాయో.. అంతకు మించిన పాజిటివ్ కామెంట్లు పడ్డాయి.అయితే  హాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆర్ఆర్ఆర్‌ను నెత్తిన పెట్టుకున్నారు.ఇక  మన దేశం నుంచి ఆస్కార్ ఎంట్రీకి ఈ సినిమాను ఎంపిక చేయకపోయినా కూడా యూఎస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మన సినిమాను ఆస్కార్ నామినేషన్‌కు పంపించింది.అయితే మొత్తానికి అన్ని కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కోసం పోటిపడుతుంది.

కాగా  బెస్ట్ యాక్టర్, డైరెక్టర్ కేటగిరీల్లో మనవాళ్లు అవార్డులు కొల్లగొడతారో లేదో చూడాలి.  ఆర్ఆర్ఆర్ సినిమా మీద మరో కొత్త చర్చ మొదలైంది. ఈ మధ్యే ఈ చిత్రాన్ని జపాన్‌లో విస్తృతంగా ప్రచారం చేసింది చిత్రయూనిట్.ఇక  రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ఫ్యామిలీలతో సహా వెళ్లి అక్కడే ఉండి ప్రచారం చేశారు. సినిమా కూడా బాగానే హిట్ అయి వసూళ్లను సాధిస్తోంది.అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ పార్ట్ 2 మీద స్పందించాడు. ఇక నా సినిమాలన్నంటికి మా నాన్నే కథలు రాస్తారు.. RRR2 కోసం మేం ఇద్దరం చర్చించుకున్నాం..

ఆయన ఈ కథ మీద ఫోకస్ పెట్టేశారు అని సీక్వెల్ గురించి హింట్ ఇచ్చాడు రాజమౌళి.కాగా  ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ భీమ్ ఇద్దరూ ఫ్రెండ్స్.. ఇద్దరూ ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకోగల స్నేహితులు.. కానీ కొట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.. చంపుకునే వరకు వచ్చారు.. ఇంకో సినిమా తీయాలంటే.. వారిద్దరినీ ఎలా చూపించాలి.. ఎలా కన్విన్స్ చేయాలో.. మళ్లీ ఏ కారణంతో కొట్టుకుంటారు.. పైగా నాటు నాటు వంటి మరో పాటను ఎలా పెట్టగలను అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. రాజమౌళి అయితే ఇప్పుడు మహేష్‌ బాబుతో సినిమా చేసేందుకు సిద్దంగా ఉన్నాడు.అంతేకాదు  ఇంకా ఈ కథను కూడా ఫైనల్ చేయలేదు. ఇక అలాంటిది ఆర్ఆర్ఆర్ ఇంకో పార్ట్ కథ అంటే ఇప్పట్లో రాదని నెటిజన్లు అంటున్నారు. రాజమౌళి ఎలాంటి ప్లాన్స్ వేస్తాడో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: