పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఏ ఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ డేట్లు దొరకకపోవడంతో ఈ సినిమాను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. ఫైనల్ గా ఈ సినిమా యొక్క షూటింగ్ ఇటీవల మొదలుపెట్టారు అన్న వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటిదాకా ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాలేదని తెలుస్తుంది.

తొందర్లోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు పెట్టబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్సినిమా ఎప్పుడు మొదలవుతుందో అన్న ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన ఈ సినిమా తర్వాత చేయవలసిన సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసాడని తెలుస్తుంది. ఇకపై తాను ఈ సినిమా మాత్రమే నటిస్తానని నిర్ణయం తీసుకున్నాడట.

ఇది కూడా సగభాగం వచ్చిన నేపథ్యంలో నిర్మాత నష్టపోకూడదని ఉద్దేశంతోనే ఆయన ఈ చిత్రానికి టేట్లు కేటాయించాలని అంటున్నారు. ఏదేమైనా పవన్ నిర్మాత శ్రేయస్సు కోరే ఈ సినిమాను కంటిన్యూ చేయడం ఆయన అభిమానులను సంతోషపడుతుంది. ఇక చారిత్రాత్మక సినిమా అయినా నేపద్యంలో సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాకు కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ మరియు బాలీవుడ్ కథానాయక జాక్వేలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే అయన ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ హరీష్ శంకర్ దర్శకత్వంలోని సినిమా ను, సురేందర్ రెడ్డి సినిమాను, అలాగే ఓ తమిళ సినిమా రీమేక్ సినిమా ను కూడా పూర్తిగా పక్కన పెట్టాడు. వీరి అడ్వాన్సు లు కూడా వెనక్కి ఇవ్వబోతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: