ఇటీవల కాలంలో తమిళ హీరోలు తెలుగు సినిమాల పట్ల మక్కువ పెంచుకున్నారు. అందుకే వారు ఎప్పుడూ లేని విధంగా తెలుగులో కూడా డైరెక్ట్ సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు అలా తమిళంలో స్టార్ హీరోగా ఉన్న ధనుష్ తెలుగులో ఇప్పటికే ఓ సినిమాను కంప్లీట్ చేసి దాన్ని విడుదలకు సిద్ధం చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమాను చేసిన ధనుష్ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయడానికి అధికారిక ప్రకటన ఇచ్చారు.

విద్యా వ్యవస్థ లోని లోపాలను వేలెత్తి చూపుతూ అందులోని పొరపాట్లను సరిదిద్దుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒక సినిమాను విడుదల చేస్తున్న తను ఈ చిత్రం పట్ల ఎంతో నమ్మకంతో ఉన్నాడు అని చెప్పాలి. ఆ విధంగా ఆయన ఈ సినిమాను విడుదల చేస్తూ ఉండగా మరికొంతమంది తమిళ హీరోలు కూడా ఇప్పుడు తెలుగు సినిమాలను చేస్తున్నారు. అందులో విజయ దళపతి వారసుడు సినిమా కూడా ఉంది.  అయితే ఇద్దరు కూడా చేస్తున్న ఈ తెలుగు సినిమాల పట్ల ఎందుకో సంతృప్తిగా లేరు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

తెలుగు దర్శకుడు అనుదీప్ చేసిన ప్రిన్స్ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. మంచి కాన్సెప్ట్ అయినప్పటికీ ఆ సినిమా ఎందుకో ప్రేక్షకులకు ఎక్కలేదు. ఓవర్ గా అంచనా వేయడమె ఆ సినిమా అలా అవడానికి కారణం అని చెప్పాలి. మరి ఈ సినిమా ఓ టీ టీ లో ఎలా అలరిస్తుందో చూడాలి.  ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా ఆ సినిమాల తరహాలో ఉంటదా అన్నట్లుగా వారు భావిస్తూ ఉండడం ఔట్పుట్ పట్ల ఎలాంటి సంతృప్తి లేకపోవడం వల్లనే ఈ విధమైన అనుమానాలు ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. మరి వీటన్నిటిని పటాపంచలు చేస్తూ ఈ సినిమాలు విజయాలను అందుకుంటాయా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: