బిగ్ బాస్ 6 హౌస్ లో టాస్కుల దగ్గర నుండి ఎలిమినేషన్స్ వరుకు ఏ క్షణం లో ఏమి జరుగుతుంది అనేది ఎవ్వరు ఊహించలేకపొతున్నారు..ఇక ఈ సీజన్ మొత్తం అన్ ఫెయిర్ గానే నడుస్తుందని..బాగా ఆడే కంటెస్టెంట్స్ అందరిని బయటకి పంపిస్తున్నారని ఆడియన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.. అయితే గీతూ, సూర్య , అర్జున్ కళ్యాణ్ మరియు బాలాదిత్య ఇలా తోపు కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అవ్వడం హౌస్ మేట్స్ తో పాటుగా ఆడియన్స్ కి కూడా మింగుడు పడలేదు..ఇక ఈ వారం కూడా అలాంటి ఎలిమినేషన్ ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది.

ఇకపోతే ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన 7 మంది కంటెస్టెంట్స్ లో అందరికంటే అతి తక్కువ ఓట్లతో డెంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఆది రెడ్డి మరియు ఫైమా.. అయితే ఫైమా కి 'ఏవిక్షన్ ఫ్రీ పాస్' ఉండడం వల్ల ఆమె నామినేషన్స్ నుండి తప్పించుకుంటుంది..కానీ ఇక  ఆమె కంటే స్వల్ప ఓట్ల తేడాతో ఆధిక్యం లో ఉన్న ఆది రెడ్డి మాత్రం ఎలిమినేట్ అవ్వక తప్పదు.ఇక ఫైమా నామినేషన్స్ లో లేకపోతే ఆ 'ఏవిక్షన్ ఫ్రీ పాస్' ని ఆది రెడ్డి ని సేవ్ చెయ్యడం కోసం ఉపయోగించేదేమో..కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు.. అయితే టాస్కుల పరంగా అద్భుతంగా ఆడే ఆది రెడ్డి,

 ఈమధ్య ఎంటర్టైన్మెంట్ టాస్కులలో కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాడు.. ఇక నిన్న జరిగిన 'బిగ్ బాస్ కోచింగ్ సెంటర్' టాస్కులో డాన్స్ మాస్టర్ గా ఆది రెడ్డి అద్భుతమైన వినోదం ని పంచాడు.. అంతేకాదు అలాగే తన భార్య మరియు బిడ్డ హౌస్ లోకి అడుగుపెట్టడం తో ఎమోషనల్ గా కూడా ఇంటి సబ్యులకు మరియు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు.ఇక అలాంటి సమయం లో ఆది రెడ్డి ఎలిమినేషన్ అనేది ఆడియన్స్ జీర్ణించుకోలేకపోవచ్చు..మరి ఈ వారం ఆది రెడ్డి గ్రాఫ్ ని మరింత పెంచుకొని ఒకరి మీద ఆధారపడకుండా ప్రేక్షకుల వోటింగ్ ద్వారానే ఎలిమినేషన్స్ నుండి సేఫ్ అవుతాడా? , లేదా ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాడా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేపుతున్న అంశం..అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్కు ఆడాల్సిందే..తప్పించుకోడానికి వీలు లేదు అని చెప్పే ఆదిరెడ్డి 'ఏవిక్షన్ ఫ్రీ పాస్' టాస్కుని వదిలేయడం వల్లే ఈరోజు డేంజర్ జోన్ లోకి రావడం కారణం అయ్యింది.. అయితే ఒకవేళ అతను ఆ టాస్కు ఆది పాస్ ని గెలుచుకొని ఉంటె కథ వేరేలా ఉండేది ..పాపం ఆది రెడ్డి బ్యాడ్ లక్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: