పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ తో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న 'హరి హర వీరమల్లు' మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే.. ఇక పది కోట్ల రూపాయిలు విలువ చేసే భారీ సెట్స్ తో సినిమాకి ఎంతో కీలకంగా నిలవబోతున్న ఇంటర్వెల్ సన్నివేశం ని చిత్రీకరిస్తున్నారు..  అయితే గత మూడు వారాల నుండి సాగుతున్న ఈ షెడ్యూల్ ఇప్పుడు చివరి దశకి చేరుకోబోతుంది.ఇక ఈ షెడ్యూల్ మొత్తం పవన్ కళ్యాణ్ గెడ్డం లుక్ లోనే షూటింగ్ లో పాల్గొన్నాడు..

ఇప్పటి వరుకు విడుదలైన రెండు గ్లిమ్స్ లలో కూడా పవన్ కళ్యాణ్ క్లీన్ షేవ్ లుక్ లోనే కనిపించాడు..కాగా ఇప్పుడు ఇంటర్వెల్ సన్నివేశం కోసం గెడ్డం పెంచడం తో పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..? అసలు క్రిష్ ఏమి ప్లాన్ చేస్తున్నాడు? అని తెలుసుకునేందుకు అభిమానుల్లో కుతూహలం మొదలైంది..ఇకపోతే మొఘల్ సామ్రాజ్యం కాలం లో బందిపోటు దొంగ 'హరి హర వీరమల్లు' చేసిన సాహసాలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ క్రిష్..ఇది పూర్తి గా కల్పిత కథ మాత్రమే.ఈ సినిమాకి సంభందించిన ఫ్రెష్ షెడ్యూల్ డిసెంబర్ మొదటి వారం నుండి ప్లాన్ చేస్తున్నారు మూవీ యూనిట్..

కాగా ఈ షెడ్యూల్ లో సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాన్ని తెరకెక్కించబోతున్నారట..ఇక ఈ క్లైమాక్స్ సన్నివేశం లో జరిగే ఫైట్ సీన్ కి వర్క్ షాప్ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తుంది..అయితే ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ హీరో బాబీ డియోల్ కూడా పాల్గొనబోతున్నాడు..ఒక పక్క షూటింగ్ లో పాల్గొంటూ మరోపక్క వర్క్ షాప్ కి హాజరవుతున్నాడట పవన్ కళ్యాణ్.అయితే ఒక సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఇంతలా శ్రద్ద తీసుకొని చెయ్యడం ఇటీవల కాలం లో 'హరి హర వీరమల్లు' సినిమాకే జరిగింది..ఇక దీనిని బట్టి మూవీ ఔట్ పుట్ ఏ రేంజ్ లో వస్తుందో ఊహించుకోవచ్చు..పవన్ కళ్యాణ్ కెరీర్ లో చిరస్థాయిగా గుర్తుండిపోయే చిత్రం గా 'హరి హర వీరమల్లు' ని తీర్చి దిద్దడానికి మూవీ యూనిట్ మొత్తం రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఔట్పుట్ వాళ్ళు కోరుకున్న విధంగా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఆగాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: