నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందాన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి ఛలో సినిమా ద్వారా పరిచయమై మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాలలో నటించి మరింత పాపులారిటీని దక్కించుకుంది. అలా సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఏకంగా మహేష్ బాబు సరసన నటించి తన క్రేజ్ పెంచుకున్న ఈమె ఇటీవల అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో డీ గ్లామరస్ పాత్ర పోషించి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా మరొకవైపు బాలీవుడ్ లో కూడా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కానీ తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం కన్నడ ఇండస్ట్రీలో ఈమెను బ్యాన్ చేయాలని ఏకంగా హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉండడం గమనార్హం. అయితే కన్నడిగులు రష్మికపై ఇంత కోపం అగ్రహం వ్యక్తం చేయడానికి కారణం.. రష్మిక ప్రవర్తన తీరు అక్కడి ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది . అసలు విషయంలోకి వెళ్తే దేశం మెచ్చిన కాంతారా సినిమాను... రష్మిక చూడకపోవడం.. సినిమా చూశారా అని అడిగినప్పుడు.. ఇంకా లేదు.. చూస్తాను.. అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆమెపై ప్రతికూల స్పందన మొదలయింది.


మరొకవైపు ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాను కన్నడ ఇండస్ట్రీకి చెందినదాన్ని అయినా తనకు మాతృభాష కన్నడ అంతగా మాట్లాడడం రాదు అని మరొకసారి విమర్శలకు దారితీసింది.. కన్నడ ఇండస్ట్రీకి చెంది కూడా.. కన్నడ మాట్లాడడం రాదు అని మాతృభాషను అవహేళన చేస్తావా .. అంటూ మరొకవైపు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అలాగే జాతకాల పేరుతో  రక్షిత్ శెట్టిని ఎంగేజ్మెంట్ చేసుకొని మరి దూరం పెట్టడంతో ఈ విషయాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అక్కడి ప్రేక్షకులు.  అందుకే ఆమెను ఎలాగైనా సరే బ్యాన్ చేయాలి అని.."#RashmiKaPuppet " ఇలా హ్యాష్ ట్యాగ్ లతో సోషల్ మీడియాలో ట్రెండీగా మారుస్తున్నారు. ఒకవేళ కన్నడ ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేస్తే మిగతా సినిమాలకు భారీ దెబ్బ పడినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: