కోలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్నప్పటికీ , మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల పాటు ఆగిపోయింది. దానితో ఈ మూవీ షూటింగ్ ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే తిరిగి ఈ మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు.

ప్రస్తుతం ఇండియన్ 2 మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇండియన్ 2 మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనుండగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఇండియన్ 2 మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మూవీ యూనిట్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా వచ్చే సంవత్సరం మార్చి నెల వరకు ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయాలి అని , ఆ తర్వాత ఏదైనా ఒక పండుగ కు ఈ మూవీ ని రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే భారతీయుడు మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం , ఆ మూవీ కి ఇండియన్ 2 మూవీ సీక్వెల్ గా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: