ప్రపంచం మెచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది అవతార్ అని స్పష్టంగా చెప్పవచ్చు.  ఇప్పటికే అవతార్ ఫ్రాంచైజీ నుంచి రెండో భాగం అవతార్ 2డిసెంబర్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే 2.2 బిలియన్ డాలర్ల మేర ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ సాగించిందని సమాచారం.. అంటే దాదాపుగా  రూ.16 వేల కోట్ల మేర బిజినెస్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.  ముఖ్యంగా అవతార్ 1 సాధించిన 2బిలియన్ డాలర్ల వసూళ్లకు సమానంగా పార్ట్-2 బిజినెస్ చేసిందని సమాచారం.

నిజానికి అవతార్ 2 చిత్రం లాంగ్ డ్రైవ్ లో మునుపటి రికార్డులన్నింటిని బ్రేక్ చేస్తుందని కూడా అంచనా వేస్తున్నారు . రిలీజ్ అయిన మొదటి మూడు వారాల్లోనే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని కూడా విశ్లేషిస్తున్నారు.. తాజాగా జరుగుతున్న బుకింగ్స్ కారణంగా ఈ నిర్ణయానికి వస్తున్నట్లు సమాచారం. అలాగే అవతార్ 2 కేవలం భారతదేశం నుండి రూ.700 కోట్లు మేర వసూలు చేస్తుందని .. కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రూ. 100 కోట్లు మినిమం గ్యారెంటీ అన్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ముఖ్యంగా" అవతార్: ది వే ఆఫ్ వాటర్"  సినిమా రాక కోసం భారతదేశ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.  ఈ ఉత్సాహం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవాలి అంటే అడ్వాన్స్ బుకింగ్లను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది.

కేవలం మూడు రోజుల వ్యవధిలో 45 స్క్రీన్ లలో ఈ చిత్రానికి సంబంధించిన 15 వేల టికెట్ల ప్రీమియం ఫార్మేట్ లలో ఇప్పటికే అమ్ముడయ్యాయి. అది కూడా 3d , 2d యేతర బుకింగ్లు ప్రారంభించిన మూడు రోజుల్లో  మొదటి రోజు 15 వేల టికెట్లు భారతదేశంలో అమ్ముడుపోయాయని సమాచారం.  దీన్ని బట్టి చూస్తే సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవబోతోందో చెప్పవచ్చు.  మొత్తానికి అయితే అవతార్ 1 ను మించి అవతార్ 2 కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: