హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా 'మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మికథానాయికగా నటిస్తోంది e చిత్రం లో. 'ఆర్ టీ టీమ్వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఈ నేపధ్యంలో కథానాయిక ఐశ్వర్య లక్ష్మి విలేఖరుల సమావేశంలో 'మట్టి కుస్తీ' విశేషాలని పంచుకున్నారు.

'మట్టి కుస్తీ' కథని ఎప్పుడు విన్నారు ?

మూడేళ్ళ క్రితం కోవిడ్ కి ముందే 'మట్టి కుస్తీ' కథ విన్నాను. నాకు చాలా నచ్చింది. అయితే ఇందులో హీరోయిన్ పాత్ర చాలా సవాల్ తో కూడుకున్నది . ఆ పాత్రకు న్యాయం చేయలేనని  నాకు అనిపించింది. ఇదే విషయం దర్శకుడికి చెప్పా. తర్వాత కోవిడ్ వచ్చింది. మూడేళ్ళ తర్వాత స్క్రిప్ట్ మళ్ళీ  నా దగ్గరికే వచ్చింది. ఈ గ్యాప్ లో కొన్ని సినిమాలు చేయడం వలన  బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. దీంతో 'మట్టి కుస్తీ' ని చేయాలని నిర్ణయించుకున్నా.

'మట్టి కుస్తీ' లో అంత సవాల్ గా అనిపించిన అంశాలేంటి?

పాత్ర చాలా ఫిజికల్ వర్క్ ని డిమాండ్ చేస్తుంది. దానికి చాలా ఫిజికల్ ప్రిపరేషన్ కావాలి. ట్రైలర్ లో స్టంట్స్ చూసే వుంటారు. ఎమోషనల్ సీన్స్ ని చేయడం నాకు ఇష్టమే. కామెడీ అనేది నా వరకూ చాలా కష్టం. మొదటి సారి ఇందులో కామెడీని  బాగా ప్రయత్నించా. ఇదివరకు నేను చేసిన పాత్రల్లో కామెడీ లేదు. 'మట్టి కుస్తీ' నాకు ఓ సవాల్. ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో తెలీదు. దర్శకుడు నా ఫెర్ ఫార్మెన్స్ పట్ల చాలా ఆనందంగా వున్నారు. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం నాకు వుంది.

'మట్టి కుస్తీ' ఎలా ఉండబోతోంది?

'మట్టి కుస్తీ' ఫ్యామిలీ డ్రామా. ఇది భార్యభర్తల కుస్తీ(నవ్వుతూ) కుస్తీ, ఇగో, వినోదం అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి. ప్రతి ఒక్కరూ 'మట్టి కుస్తీ'  సినిమా కి బాగా కనెక్ట్ అవుతారు. ఇంత చక్కని ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం వున్న చిత్రం ఈ మధ్య కాలంలో రాలేదు. ఆడ మగ సమానమే అనే సందేశాన్ని చాలా వినోదాత్మకంగా చూపించాం. పైసా వసూల్ మూవీ 'మట్టి కుస్తీ'.

విష్ణు విశాల్ తో పని చేయడం ఎలా అనిపించింది?

విష్ణు విశాల్ స్ఫూర్తినిచ్చే వ్యక్తి. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ది బెస్ట్ కోసం  ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుండి ఆయన సరిగ్గా నిద్రకూడా పోలేదు. విష్ణు విశాల్ కి కథల ఎంపికలో మంచి అభిరుచి వుంది. ఆయన లాంటి విజన్ చాలా తక్కువ మందిలో కనిపిస్తుంటుంది. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. నటుడిగా, నిర్మాతగా ఆయన ప్రయాణం  చాలా అద్భుతం. ఆయనతో పని చేయడం చాలా అనందం గా వుంది.

తెలుగు ప్రేక్షకులు గురించి మీ అభిప్రాయం ?

తెలుగు ప్రేక్షకులు సినిమాని గొప్పగా ప్రేమిస్తారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ గా ఎదిగింది అని అర్థమవతుంది. టాలీవుడ్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేస్తోంది. తెలుగు నుండి వస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కు గొప్ప ఆదరణ వస్తోంది. చాలా పరిశ్రమలు తెలుగు ఇండస్ట్రీని ఫాలో అవ్వడం గమనించాను. తెలుగు ప్రేక్షలులకు సినిమా పట్ల వున్న అభిమానం, ప్రేమే దీనికి కారణం.

తెలుగు సినిమాలు చూస్తారా? మీ అభిమాన నటులు ఎవరు ?

తెలుగు సినిమాలు చూస్తాను. అందరూ ఇష్టమే. నటీనటులందరూ ప్రేక్షకులకు వినోదం పంచడానికి కృషి చేస్తారు. ప్రేక్షకులు ఇష్టపడే సినిమాలు చేస్తారు. సాయి పల్లవి, సత్యదేవ్ లతో  మంచి పరిచయం వుంది.

రవితేజ గారు ఈ సినిమాకి ఒక నిర్మాత.. ఆయన్ని కలిశారా ?

రవితేజ గారు షూటింగ్ కి రాలేదు. విష్ణు విశాల్ ని పూర్తిగా నమ్మి, కావాల్సింది సమకూర్చి ఫైనల్ ప్రోడక్ట్ ని మాత్రమే చూపించమన్నారు. ఫైనల్ అవుట్ పుట్ ని చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు అందరూ. ప్రీరిలీజ్ ఈవెంట్ లో రవితేజ గారిని  కూడా కలిశాను.

మరింత సమాచారం తెలుసుకోండి: