టాలీవుడ్ లో రెండు దశాబ్దాల పాటు తన అంద చందాలతో ఆకట్టుకున్న హీరోయిన్ తమన్నా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మొదట శ్రీ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత హ్యాపీడేస్ సినిమాతో తన సత్తా చాటింది. ఈ చిత్రంతో సూపర్ క్రేజ్ అందుకుంది తమన్నా. అప్పటినుంచి తన రేంజ్ను అమాంతం పెంచుకుంటూనే వచ్చింది. టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా తండ్రి కొడుకులతో నటించిన ఘనత కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. చివరిగా f3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా పర్వాలేదు అనిపించుకుంది.
సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తమన్నా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇలా పలు భాషలలో కూడా అవకాశాలను అందుకుంటూ ఉంటుంది తమన్నా. తాజాగా బబ్లీ బౌన్సర్ అనే సినిమాతో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా తన హవా కొనసాగిస్తుంది. ప్రస్తుతం తమన్నా చేతిలో గుర్తుందా శీతాకాలం , భోళా శంకర్ తదితర చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. సినిమాలు ఎన్నున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ తన అంద చందాలను ప్రదర్శిస్తూ రెచ్చిపోతూ ఉంటుంది తమన్నా. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తనకు వివాహం అవ్వబోతుందని వార్తలపై కూడా స్పందించింది.


తాజాగా సరికొత్త ఫోటో షూట్లతో తమన్న జిగేల్ జిగేల్ మనే కనిపించేలా లేహంగాలో మెరుపులు కురిపిస్తుంది.  లెహంగా టాప్ జాకెట్ లో తన అందాలను ప్రదర్శిస్తూ హాట్ షో చేస్తూ కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి రెండు దశాబ్దాలకు పైగా కావస్తోంది.  అయినప్పటికీ తన ఆందోళనలో ఎలాంటి మార్పు లేకుండా మెయింటైన్ చేస్తూ వస్తోంది తమన్నా. తన గ్లామర్ తోనే కాకుండా నటనతోనే ఎంతోమంది కుర్రకారులను ఆకట్టుకున్న తమన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తన హవా కొనసాగిస్తూ వస్తోంది. ప్రస్తుతం తమన్నా కి సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: