తాజాగా సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే.. మహేష్ బాబు పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల పుట్టినరోజు జాబితాలో ఉన్న బ్లాక్ బస్టర్ సినిమాలను వారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసి మరింత కలెక్షన్స్ వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కాకపోయినా ఆయన సినీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ రొమాంటిక్ చిత్రంగా మిగిలిపోయిన ఖుషి సినిమాను మళ్ళీ వచ్చే ఏడాది రీ రిలీజ్ చేయాలని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు రీ రిలీజ్ చేసే తేదీని కూడా ప్రకటించడం గమనార్హం.


అయితే 2003 ఫిబ్రవరి 7వ తేదీన ఎస్ జె సూర్య,  సునీల్ కుమార్ అగర్వాల్ సంయుక్త దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా.. భూమిక హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ఖుషి .. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది 2003 ఫిబ్రవరి 7వ తేదీన రీ రిలీజ్ చేయకుండా 2023 ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే ఆ రోజే ఎందుకు రిలీజ్ అన్న విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.


సెప్టెంబర్ 2 ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిపోయింది.  కానీ మరి వచ్చే ఏడాది అదే రోజున ఎందుకు విడుదల చేయబోతున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు . మొత్తానికైతే ఖుషి సినిమా రీ రిలీజ్ అని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరొకవైపు రాజకీయాలపై కూడా దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: