సీనియర్ హీరో బాలయ్య షో గురించి అందరికి తెలిసిందే..అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి, ఇలా స్టార్స్ తో సరదాగా గడపడం పై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఆఁహాఁ లో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 అందరికి తెలిసిందే..వెండితెరతో పాటు డిజిటల్ ప్లాట్ ఫాంలోను తెగ సందడి చేస్తున్నాడు. గతంలో వచ్చిన సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ కాస్త ఆసక్తిగా ఉందన్న విషయం అందరికి తెలిసిందే..షోతో డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తున్న బాలయ్య … ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులతో ఫన్‌ చిట్‌ చాట్ చేశాడు. ఈ ఎపిసోడ్స్ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచాయి. ఇక తాజా ఎపిసోడ్‌లో లెజెండరీ డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, కే రాఘవేంద్రరావు, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌తో సరదా చిట్‌చాట్ చేశాడు బాలకృష్ణ.


అన్‌స్టాపబుల్ సీజన్ 2లో ఇప్పటికే చంద్రబాబు నాయుడు-లోకేష్‌, సిద్దు జొన్నలగడ్డ, శర్వానంద్‌తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులకు సంబంధించిన ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. రానున్న రోజులలో ఎవరెవరు హాజరు అవుతారనే ఆసక్తి అందరిలో ఉంది. చివరి ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్ వస్తాడని ప్రచారం నడుస్తుంది. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా షోలో పాల్గొనబోతున్నట్టు టాక్. అసలు మొదటి సీజన్ లోనే డార్లింగ్ ప్రభాస్ తో బాలయ్య షో ఉండాల్సి ఉండే కానీ అది కుదరలేదు. కట్ చేస్తే రెండో సీజన్ లో ప్రభాస్ వస్తున్నాడు. బాలయ్య షోలో ప్రభాస్ వస్తే ఈ ఎపిసోడ్ మాత్రం బాక్స్ లు బద్ధలవ్వడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్..


బాలయ్య ప్రశ్నల వర్షం కు డార్లింగ్ ప్రభాస్ సమాధానాలు ఎలా ఇస్తాడు అనే దారి గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్‌ గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన జై బాలయ్య సాంగ్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. పక్కా పవర్‌ ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ సినిమాల తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి తో సినిమా చేస్తున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: