జేమ్స్ కామరూన్ సృష్టించిన అద్భుతం ‘అవతార్ 2’ గురించి ప్రపంచం యావత్తు ఆశక్తిగా ఎదురు చూస్తోంది. గత కొంతకాలంగా సినిమాలు చూడటం తగ్గించి వేసిన వారు కూడ ఈసినిమాను చూసి తీరుతారు అని భావిస్తూ ఉండటంతో కేవలం ఇండియా నుండే ఈసినిమాకు 700 కోట్ల కలక్షన్స్ పైగా వస్తాయని అంచనాలు వేస్తున్నారు.


తెలుగు రాష్ట్రాలలో కూడ ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా ఈసినిమాకు సంబంధించి హైదరాబాద్ లో కొన్ని ధియేటర్లలో ఓపెన్ అయిన అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లు కేవలం కొన్ని నిముషాలలో బుక్ అయిపోవడంతో ఈమూవీ పై తెలుగు ప్రేక్షకులలో మ్యానియా ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. అయితే దీనికి భిన్నంగా ఉత్తర భారతదేశం సినీ ప్రియులు ‘అవతార్ 2’ పై పెద్దగా ఆశక్తి కనపరచడం లేదు అని వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి.


‘అవతార్’ లాంటి విజువల్ వండర్ ను త్రీడీ 4డీఎక్స్ లాంటి ఫార్మాట్స్ లో చూసేందుకు దక్షిణాది ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే పరిస్థితి దక్షిణాది రాష్ట్రాలలో కూడ కనిపిస్తోంది. అయితే ఉత్తరాదిన మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ముంబయి ఢిల్లీ అహ్మదాబాద్ పూణె కోల్ కత్తా ఇలా ఏ ప్రాంతంలో చూసుకున్నా ‘అవతార్-2’ కు అడ్వాన్స్ బుకింగ్స్ పేలవంగా ఉన్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి.


30 నుంచి 40శాతం మించి అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు అని అంటున్నారు. ‘అవతార్ 2 కోసం కనిష్టంగా 500 నుంచి గరిష్టంగా 1300 రూపాయల వరకు టికెట్ ధరలు పెట్టినట్లు తెలుస్తోంది.  అయితే కొన్ని చోట్ల 1400 కూడ పెట్టినట్లు టాక్. దీనితో టిక్కెట్ ధర మూలంగా ఈసినిమా టిక్కెట్ల పై మోజు లేదా లేకుంటే కరోనా వేవ్ లు తరువాత బాలీవుడ్ లో ప్రేక్షకులు ధియేటర్లకు రావడం తగ్గించిన పరిస్థితులలో ఆ ప్రభావం ‘అవతార్ 2’ పై కూడ కనిపిస్తోందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి..  మరింత సమాచారం తెలుసుకోండి: