కెరియర్ ప్రారంభంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న తేజ సజ్జ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు ను తెచ్చుకున్న తేజ సజ్జ ప్రస్తుతం సినిమా లలో హీరో పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే పలు మూవీ లలో తేజ సజ్జ హీరోbగా నటించి  , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో గా కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తేజ సజ్జ "హనుమాన్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. కొన్ని రోజుల క్రితమే హనుమాన్ మూవీ నుండి ఈ చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది. 

ఈ టీచర్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించినప్పటికీ ఈ మూ వీలోని గ్రాఫిక్స్ కి చాలా మంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ మూవీ టీజర్ ను తెలుగు తో పాటు తమిళ ,  కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ టీజర్ ఇప్పటికే 50 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సాధించినట్లు ,  అలాగే 2 మిలియన్ ప్లస్ లైక్ లను సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే హనుమాన్ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు. తెలుగు ,  తమిళ , హిందీ , మలయాళ ,  కన్నడ భాషలలో ఈ మూవీ ని విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: