ఇది ఇలా ఉండగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవితేజా పాన్ ఇండియా మూవీ మ్యానియా పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయాయి. ప్రస్తుతం ప్రతి సినిమాకు పాన్ ఇండియా అనే ట్యాగ్ లైన్ తగిలించడం ఒక ఫాషన్ గా మారిపోయింది అంటూ సెటైర్ వేసాడు. అంతేకాదు చిన్న సినిమాలకు కూడ పాన్ ఇండియా ట్యాగ్ లు తగిలించడం షాకింగ్ గా ఉంది అంటూ కామెంట్స్ చేసాడు.
అదేవిధంగా ఒక సినిమాను భారీగా రిలీజ్ చేస్తే పాన్ ఇండియా అవ్వదు అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. తన సినిమాలలో ‘టైగర్ నాగేశ్వరరావు’ పాన్ ఇండియా సినిమా అవుతుందని పాన్ ఇండియా అవ్వాలంటే కథలో కంటెంట్ కూడ దేశవ్యాప్తంగా అందరికి కనెక్ట్ అయ్యేవిధంగా ఉండాలి అంటున్నాడు. తను కథను నమ్ముతానని కథ నచ్చకుండా కాంబినేషన్ కుదిరిందని సినిమా చేయనని అంటున్నారు.
అయితే కధను నమ్మి సినిమా చేస్తాను అని చెపుతున్న రవితేజా ‘ధమాకా’ లాంటి ఏవరేజ్ కథను కధను తన సినిమాగా ఎందుకు ఎంచుకున్నాడు అన్నది సమాధానంలేని ప్రశ్న. ఏదిఏమైనా మాస్ మహారాజాకు ఈ ఏడాది పెద్దగా కలసివచ్చినట్లు కనిపించడంలేదు. దీనితో అతడి ఆశలు అన్నీ చిరంజీవితో కలిసి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ పైనే ఉన్నప్పటికీ సంక్రాంతి రేస్ లో ఈ మూవీ ఏ రేంజ్ లో హిట్ అవుతుంది అన్న విషయం పై రవితేజా మార్కెట్ ఆధారపడి ఉంటుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి