ప్రతిసారి సంక్రాంతి పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ సారి కూడా సంక్రాంతి పండుగ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ ల వద్ద పండుగ వాతావరణం కనిపించబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీర సింహా రెడ్డి మూవీ మరియు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమాలు ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిచిన విషయం మనకు తెలిసింది.

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీర సింహా రెడ్డి మూవీ ని జనవరి 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనుండగా ... చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ ని జనవరి 13 వ తేదీన థియేటర్ లలో విడుదల చేనున్నారు. ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు సినిమాల విడుదల విషయంలో అద్భుతమైన గుడ్ న్యూస్ ఇచ్చింది.

ఈ రెండు మూవీ లకు కూడా తెలంగాణ రాష్ట్రంలో 6 షో లకు పర్మిషన్ ఇచ్చింది. ఈ సినిమాలు విడుదల అయిన రోజున ఉదయం 4 గంటల నుంచే షో లు వేసుకోవచ్చు అని తెలంగాణ సర్కార్ పేర్కొంది. ఇలా భారీ క్రేజ్ ఉన్న ఈ రెండు సినిమాలకు తెలంగాణ సర్కార్ 6 షో లకు పర్మిషన్ ఇవ్వడంతో ఈ మూవీ లకు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన కలెక్షన్ లు లభించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ మూవీ లు తెలంగాణ రాష్ట్రంలో ఏ రేంజ్ కలెక్షన్ లను అందుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: