నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫుల్ యాక్షన్ రామగాథ ఎక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేస్తుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ అవడంతో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు చిత్ర బృందం .ఆ ఇంటర్వ్యూలలో భాగంగానే సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు.ఇందులో భాగంగానే ఎవరు ఎంత రమ్యన రేషన్ తీసుకుంటున్నారు కూడా చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే గోపీచంద్ ఇప్పుడు వరకు తెరకెక్కించిన సినిమాలకు పూర్తి రెమ్యూనికేషన్ ఎప్పుడు అందుకోలేదని చెప్పుకొచ్చాడు. 

మొదటిసారి వీర సింహారెడ్డి సినిమాకు మాత్రమే ఆయన పూర్తిస్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. రవితేజ నటించిన డాన్ శీను సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు గోపీచంద్. దాని అనంతరం బాడీగార్డ్ ,బలుపు ,పండగ చేసుకో విన్నర్, క్రాక్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన విన్నర్ సినిమా తప్ప మిగిలిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. అయితే ఈ అన్ని సినిమాలలో ఒక సినిమాకి కూడా పూర్తిస్థాయిలో రమ్యునరేషన్ తీసుకోలేదట గోపీచంద్. దాని అనంతరం రవితేజ తో కలిసి తీసిన క్రాక్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న తర్వాతే

 రెమ్యూనిరేషన్ ఆయన తీసుకున్నట్లుగా వెల్లడించాడు. ఇదిలా ఉంటే ఇక ఆయన దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాకి గాను ప్రశంసలు అందుకుంటున్నాడు ఈ దర్శకుడు. థియేటర్లలో జై బాలయ్య అంటూ బాలయ్య అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు.ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఎమోషన్తో అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య కి జోడిగా శృతిహాసన్ నటించిన మరొక  పాత్రలో హానీ రోజ్ నటించింది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ మరియు కన్నడ హీరో దునియా విజయ్ నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అంతే కాదు ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించినందుకు గాను భారీ రెమ్యూనరేషన్ను తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలి అంటే బాలకృష్ణ కంటే వరలక్ష్మి శరత్ కుమార్ కి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: