స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్3 తో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్నారు సీనియర్ విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం రానానాయుడు వెబ్ సిరీస్ చేస్తోన్న వెంకటేష్..ఇప్పుడు మరో కొత్త మూవీ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై వెంకట్ బోయనపల్లి నిర్మించనున్న హై-బడ్జెట్ యాక్షన్ సినిమా ఇది. ఈ మూవీకి ఇక 'HIT' ఫ్రాంచైజ్ తో వరుస విజయాల్ని అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వం వహించనున్నారు. వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ మూవీ ఇది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ప్రొడక్షన్ నెం 2 గా ఈ మూవీ రాబోతుంది. వెంకటేష్‌కి ఆయన కెరీర్ లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ కానుంది.పాన్ ఇండియా రేంజిలో వస్తున్న ఈ మూవీ పై సహజంగానే భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ లుక్ పోస్టర్‌లో వెంకటేష్ చేతిలో ఏదో పట్టుకున్న సిల్హౌట్ ఇమేజ్ కనిపించింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ వీడియో అయితే మరో లెవల్లో ఉందనే చెప్పుకోవాలి. దీన్ని చూస్తుంటే కమల్ హాసన్ నటించిన విక్రమ్ ఓ రేంజ్ కంబ్యాక్ గా అనిపిస్తూ అదే తరహాలో ఓ సాలిడ్ యాక్షన్ చిత్రంలా కనిపిస్తుంది.


ఈ వీడియోలో కనిపించిన విజువల్స్ ఇంకా ఎలివేషన్స్ సాలిడ్ గా ఉన్నాయి. చాలా కాలం తర్వాత మరోసారి మాస్ యాక్షన్ లుక్ లో విక్టరీ వెంకటేష్ అలరించనున్నారు.వెంకటేష్ టైటిల్ ట్యాగ్ కి తగ్గట్లే విన్నంగ్ స్క్రిప్ట్‌ను రాసిన శైలేశ్ కొలను, వెంకటేష్ ను మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త పాత్రలో ప్రజంట్ చేయనున్నారు. ఈ సినిమాకి సైంధవ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. అంతేకాకుండా ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా కూడా అనౌన్స్ చేశారు. దీంతో వెంకీ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోనున్నారు. ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి మరింత వేగంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు నటించనున్నారు.కబాలి సినిమాకి సంగీతం అందించిన సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా ఇతర నటీనటులు ఇంకా సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో మేకర్స్ అనౌన్స్ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: