
ఇదిలా ఉంటే ఇక బాలయ్యను సినిమాల్లో సింగిల్ గా చూడలేమా అనే భావన అభిమానుల్లో కలుగుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా నటిస్తున్న అన్ని సినిమాల్లో కూడా డబల్ రోల్ చేస్తూ ఉన్నాడు. గతంలో వచ్చిన అఖండ సినిమాలో కూడా డబుల్ రోల్ చేసి హిట్టు కొట్టాడు. ఇక ఇటీవల వీర సింహారెడ్డి సినిమాలో కూడా వీరసింహారెడ్డి, జై సింహారెడ్డి అనే రెండు పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇకపోతే ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్నాడు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ సినిమాలో కూడా ఇద్దరు బాలకృష్ణలు అలరించబోతున్నారట. సీనియర్ బాలకృష్ణ జూనియర్ బాలకృష్ణ అనే హిట్ కాన్సెప్ట్ వాడుకోవాలని అటు సక్సెస్ఫుల్ దర్శకుడుగా ఉన్న అనిల్ రావిపూడి అనుకుంటున్నాడట. ఇక ఇందుకు అటు బాలయ్య నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక యువ హీరో పాత్ర ఉందని అందుకోసం ఎంతోమంది హీరోలను అనుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ పాత్రను కూడా బాలయ్యే చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇద్దరు బాలకృష్ణ లను మరోసారి ఒకే ఫ్రేమ్లో చూసేందుకు ఫ్యాన్స్ కూడా ఆనందంగా వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొంతమంది ఇక సినిమాల్లో సింగిల్ బాలకృష్ణ ని చూడలేమా అని అనుకుంటున్నారట.