టాలీవుడ్ టాలెంటెడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సింగరేణి బ్యాక్ గ్రౌండ్ లో రాబోతున్న ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటుంది. ఈ సినిమాని మార్చి 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా కాకుండా ఈమధ్య ఆయన తన తరువాతి ప్రాజెక్ట్ ని కూడా అనౌన్స్ చేసారు. న్యాచురల్ స్టార్ నాని 30వ సినిమా వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం1 గా రూపొందనుందని కొత్త సంవత్సరం సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఇంకా అలాగే మూర్తి కెఎస్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు ఈ మూవీ మేకర్స్.


ఇంకా టైటిల్ కన్ఫర్మ్ చేయని ఈ సినిమా ప్రారంభ పూజా కార్యక్రమం జనవరి 31 వ తేదీన హైదరాబాద్‌లో జరగనుంది. ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ అనేది ప్రారంభం కానుంది. ఇటీవల సీతా రామం సినిమాతో యూత్ ని తన అందం అభినయంతో కట్టిపడేసిన మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నానికి జోడిగా నటించనున్నారు. గతంలో విడుదల చేసిన గ్లింప్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. తండ్రీకూతుళ్ల మధ్య అందమైన బంధాన్ని చూపించే హార్ట్ టచింగ్ వీడియోని మేకర్స్ రివిల్ చేశారు. ఈ గ్లింప్స్‌కి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది.ఈ సినిమాకి కొంతమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు కూడా పనిచేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ ISC డీవోపీగా ఇంకా అలాగే హృదయం ఫేమ్‌ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ ని అందించనున్నారు. అలాగే ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా ఇంకా జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్ గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఇంకా అలాగే క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా భాను ధీరజ్ రాయుడు ఈ సినిమాకి పని చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: